AP News: ఏపీలో రెబల్ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.? స్పీకర్ నిర్ణయం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీలోకి మారారు. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు ఫిర్యాదు చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీలోకి మారారు. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు ఫిర్యాదు చేసారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, కరణం బలరాం, వల్లభనేని వంశీతో పాటు మద్దాలి గిరిధర్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేసారు. అయితే ఆయా ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసారు. ముందుగా నోటీసులకు రాతపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసారు. స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒకసారి మాత్రమే స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేసిన వారు ఇచ్చిన వీడియో క్లిప్పింగ్‌లు, ఇతర ఆధారాలు తమకు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. సభ్యుల కోరిక మేరకు అన్ని ఆధారాలను స్పీకర్ కార్యాలయం నుంచి వారికి పంపించారు. అయితే ఆ తర్వాత నోటీసులకు మాత్రం ఎమ్మెల్యే ఆనం ఒక్కరే స్పందించారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం తమకు మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు అనర్హత వేటుకు సంబంధించి న్యాయపరంగానూ ఎప్పటికప్పుడు చర్చించారు. అటు తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా స్పీకర్ ముందు హాజరుకాలేదు. దీంతో స్పీకర్ ఏం నిర్నయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
స్పీకర్ కోర్టులోకి చేరిన అనర్హత వేటు నిర్ణయం
వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం ఎనిమిది మంది నేడు స్పీకర్ ఎదుట హాజరుకాలేదు. ఎమ్మెల్యేలతో పాటు వారిపై ఫిర్యాదు చేసిన వారు కూడా రావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. దీంతో తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన ఆ పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రమే స్పీకర్ ఎదుట హాజరయ్యారు. తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసామన్నారు బాలవీరాంజనేయ స్వామి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సభ్యులు స్పందించడం లేదన్నారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు తెలుగుదేశం పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ఎదుట హాజరుకాలేమని లేఖలు పంపించారు. తమపై వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను లేఖల ద్వారా కోరారు. అంతేకాకుండా తమపై ఫిర్యాదు చేసిన వారు ఇచ్చిన మరిన్ని ఆధారాలు, వాటి ఐపీ అడ్రస్‌లను కూడా ఇవ్వాలని కోరారు. వైసీపీ రెబల్స్ మీద ఫిర్యాదు చేసిన ప్రభుత్వ చీఫ్ విఫ్ ప్రసాదరాజు మాత్రమే స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేల గైర్హాజరుతో వారిపై అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను చీఫ్ విప్ ప్రసాదరాజు కోరారు. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసుల్లో ఇదే చివరి అవకాశంగా పేర్కొన్నారు. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకుంటే ఫిర్యాదుపై ఉన్న ఆధారాలు, స్పీకర్‌కున్న పరిధి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే ప్రచారం మాత్రం జోరందుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..