Rain Alert: భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షాలు, పోటెత్తుతున్న వరదతో అనేక గ్రామాలు, పంటపొలాలు నీటమునిగాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో 9రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఐదురోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయని సూచింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షాలు, పోటెత్తుతున్న వరదతో అనేక గ్రామాలు, పంటపొలాలు నీటమునిగాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో 9రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఐదురోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయని సూచింది. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఉత్తర భారత దేశంలోని గుజరాత్,మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. పోర్‌బందర్, సూరత్, జునాఘడ్ , వడోదర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పలుజిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల దాటికి గుజరాత్‌లోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది. ఇదే క్రమంలో 150 అడుగుల నుంచి జాలువారుతున్న వరద నీటితో గిర్మల్ జలపాతం కనువిందు చేస్తోంది.
మరోవైపు మహారాష్ట్రలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. ఇక మధ్యప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పొంగిపొర్లుతున్న వంతెనను దాటుతూ సియోనిలో ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. బైక్‌పై వంతెన దాటుతుండగా.. ఈఘటన జరిగింది. కొట్టుకుపోయిన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీలోను జోరు వర్షం కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.