AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress – BRS: బీఆర్ఎస్‌ విలీనంపై కోమటిరెడ్డి కామెంట్స్‌ వెనుక ఉన్న అర్థం ఏంటి?

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..? కాంగ్రెస్ నేతల కామెంట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేల జాయినింగ్స్‌తో బీఆర్ఎస్‌ఎల్ఎపీ.. కాంగ్రెస్‌లో విలీనం ఖాయమని చెప్తూనే.. మరోవైపు.. బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది.

Congress - BRS: బీఆర్ఎస్‌ విలీనంపై కోమటిరెడ్డి కామెంట్స్‌ వెనుక ఉన్న అర్థం ఏంటి?
Komatireddy Venkat Reddy
Balaraju Goud
|

Updated on: Jul 27, 2024 | 7:27 AM

Share

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..? కాంగ్రెస్ నేతల కామెంట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేల జాయినింగ్స్‌తో బీఆర్ఎస్‌ఎల్ఎపీ.. కాంగ్రెస్‌లో విలీనం ఖాయమని చెప్తూనే.. మరోవైపు.. బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది. ఇంతకీ.. బీఆర్ఎస్‌ విలీనంపై కోమటిరెడ్డి కామెంట్స్‌ వెనుక ఉన్న అర్థం ఏంటి?.. కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ విమర్శలను బీఆర్ఎస్‌ ఎలా తిప్పికొట్టబోతోందన్నదీ ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. బీఆర్ఎస్ఎల్పీ విలీనం దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీఆర్ఎస్‌ విలీనంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా మోదీ సర్కార్‌ను కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బీజేపీలో బీఆర్ఎస్‌ పార్టీ విలీనానికి చర్చలు జరుగుతున్నాయనేదానికి ఇదే నిదర్శనమని చెప్పారు. బీజేపీలో విలీనానికి అడుగులు పడుతుండడంతోనే కేంద్రాన్ని కేసీఆర్‌ ఒక్క మాట అనడంలేదని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి.

వాస్తవానికి.. ఇప్పటికే 10మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని హస్తం పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. దాంతో.. బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్‌ఎల్పీ విలీనంపైనే పెద్దయెత్తున చర్చలు సాగుతుండడగా.. బీఆర్ఎస్ పార్టీ విలీనంపైనా తమకు పక్కా సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారుతున్నాయి. అంటే.. ఈ లెక్కన.. బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే.. బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అటు.. కాంగ్రెస్‌ నేతల కామెంట్స్‌ను బీఆర్ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌ మైండ్‌గేమ్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోంది. మొత్తంగా.. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ ​విలీనం ఖాయమన్న కోమటిరెడ్డి కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే