Olympics: ఒలింపిక్స్ లో సత్తా చాటే భారత క్రీడాకారులు ఎవరు? పారిస్ ఒలింపిక్స్ స్పెషలేంటి??

ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో మన సంగతేంటి అని చాలామందికి అనిపిస్తుంది. మన దేశం నుంచి 118 మంది క్రీడాకారులు పాల్గొంటారు. మొత్తం 16 క్రీడల్లో వీరి ప్రాతినిథ్యం ఉంటుంది. టోక్యోలో 2020లో జరిగిన ఒలింపిక్స్ లో అయితే స్వర్ణంతో కలిపి ఏడు మెడల్స్ సాధించాం. ఈసారి డబుల్ డిజిట్ వస్తుందా?

Olympics: ఒలింపిక్స్ లో  సత్తా చాటే భారత క్రీడాకారులు ఎవరు? పారిస్ ఒలింపిక్స్ స్పెషలేంటి??

|

Updated on: Jul 26, 2024 | 4:46 PM

దాని పేరులోనే గర్వముంది. ధైర్యముంది. సంతోషం ఉంది. దుఃఖముంది. గాంభీర్యం కూడా కనిపిస్తుంది. ఎన్ని ఫీలింగ్స్ కనిపించినా.. అక్కడ ఒక్కదానికే విలువుంది. అదే.. గెలుపు. అవును విజయం ఒక్కటే అక్కడ కొలమానం. విక్టరీ ఒక్కటే అక్కడ హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఆ వేదిక.. ఒలింపిక్స్. ఈసారి దానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఆతిథ్యం ఇస్తోంది. వందేళ్ల తరువాత కావడంతో ఈసారి ఒలింపిక్స్ కు అంత ప్రయార్టీ పెరిగింది. ప్రపంచ క్రీడాలోకమంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వేడుక. ఇందులో పోటీ పడి నిలిచి గెలిచి సత్తా చాటాలని ఎంతోమంది కోరుకుంటారు. కానీ విజయం కొందరినే వరిస్తుంది. అలాంటి ఒలింపిక్స్ ను ఈసారి ప్యారిస్ ఎలా నిర్వహించబోతోంది?

జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పోటీల కోసం ఎలా సన్నద్దమైంది? ఫ్రీడమ్ కు, ఈక్వాలిటీకి కేరాఫ్ గా నిలిచే ఫ్రాన్స్ లో.. 1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లోనే తొలిసారిగా మహిళా క్రీడాకారులకు చోటు కల్పించారు. ఈసారి ఒలింపిక్స్ లో మహిళా సాధికారతను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు పురుషులతో దాదాపు ఈక్వల్ గా.. మహిళా క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు. వారి సంఖ్య.. దాదాపు 5 వేల 250. పైగా ఇక్కడి వేదికల్లో కొన్నింటికి ఫ్రెంచ్ లేడీస్ పేర్లు పెట్టడాన్ని బట్టి చూస్తే.. వారికి ఆ దేశం ఎంత ప్రయార్టీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్ లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

 

Follow us