Mr. & Mrs. Mahi OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ సినిమా కంటే ముందు జాన్వీ కపూర్ నటించిన చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీ. ఇందులో బీటౌన్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించగా.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది మే31 అడియన్స్ ముందుకు వచ్చింది.
ధడక్ సినిమాతో హీరోయిన్గా సినీరంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఉలఝ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా కంటే ముందు జాన్వీ కపూర్ నటించిన చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీ. ఇందులో బీటౌన్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించగా.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది మే31 అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమాలో మరోసారి తనదైన నటనతో అలరించింది జాన్వీ. థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 26 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం హిందీలో ఈ సినిమా అందుబాటులో ఉండగా.. తెలుగులోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఓటీటీలోనూ అదొక్క భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. డైరెక్టర్ శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
క్రికెట్ అంటే చాలా ఫ్యాషన్ ఉండే భార్యభర్తల స్టోరీతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. భార్యను మంచి క్రికెటర్ చేయాలని భర్త కష్టపడడం.. ఆ తర్వాత వారిద్దరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా. ఇందులో జాన్వీ, రాజ్ కుమార్ రావుతోపాటు రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా, పూర్ణేందు భట్టాచార్య, జరీనా వాహబ్, అర్జి్త్ తనేజా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించగా.. ఈ చిత్రానికి ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.