Chandu Champion OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ డ్రామా.. చందు ఛాంపియన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. అలాగే విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటాయి. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల జీవితాల ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను రూపొందించారు. చాలా కాలం తర్వాత హిందీలో తెరకెక్కిన మరో బయెపిక్ చందు ఛాంపియన్. బీటౌన్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. అలాగే విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు.
జూన్ 14న విడుదలైన ఈ సినిమా మొదటిరోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం భాషలలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ చిత్రాన్ని ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. రూ.199 చెల్లించి రెంట్ పద్దతిలో ఈ సినిమాను చూసేయ్యెచ్చు.
మొదటి పారాలింపిక్ స్వర్ణపతాక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మనసులను మెలిపెట్టే సీన్స్ చాలానే ఉన్నాయట. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఫ్రీగా చూసేందుకు మాత్రం వీలు లేదు. ఇక కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. పదవ తరగతిలోనే మోడలింగ్ ఆడిషన్స్ లో పాల్గొన్నాడు. పత్నీ ఔర్ వో సీక్వెల్ లో నటించాడు. ఆ తర్వాత హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.