Tea stain on Passport: మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

పాస్‌పోర్టుపై చిన్న టీ మరక ఉండటంతో తమను విమానం ఎక్కనీయలేదని ఓ జంట ఆరోపించింది. అదే పాస్‌పోర్టుతో గతంలో ఎన్నోసార్లు ప్రయాణించామని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని వాపోయారు. బ్రిటన్‌కు చెందిన రోరీ ఆలెన్, నీనా విల్కిన్స్‌కు ఇటీవల ఈ ఊహించని అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, వారిద్దరూ స్పెయిన్‌లోని కోస్టా బావాకు వెళ్లేందుకు ఈస్ట్‌మిడ్‌లాండ్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.

Tea stain on Passport: మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

|

Updated on: Jul 26, 2024 | 5:46 PM

పాస్‌పోర్టుపై చిన్న టీ మరక ఉండటంతో తమను విమానం ఎక్కనీయలేదని ఓ జంట ఆరోపించింది. అదే పాస్‌పోర్టుతో గతంలో ఎన్నోసార్లు ప్రయాణించామని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని వాపోయారు. బ్రిటన్‌కు చెందిన రోరీ ఆలెన్, నీనా విల్కిన్స్‌కు ఇటీవల ఈ ఊహించని అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, వారిద్దరూ స్పెయిన్‌లోని కోస్టా బావాకు వెళ్లేందుకు ఈస్ట్‌మిడ్‌లాండ్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రయానెయిర్ చెకిన్ కౌంటర్ దగ్గర తమ పాస్‌పోర్టులతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించారు. అక్కడి సిబ్బంది నీనా పాస్‌పోర్టుపై టీ మరకను గుర్తించినా లోపలికి అనుమతించారు. ఆ తరువాత వారు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు ముగించుకుని బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న సిబ్బంది మాత్రం నీనా పాస్‌పోర్టుపై టీ మరక ఉండటంతో అభ్యంతరం చెప్పారు. పాస్‌పోర్టు రంగు మారిన కారణంగా ఇది చెల్లదని చెబుతూ విమానం ఎక్కనివ్వలేదు. ఆ తరువాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని విమానాశ్రయం బయటకు తీసుకెళ్లిపోయారు. దీంతో, వారు జెట్2 ఎయిర్‌లైన్స్ టిక్కెట్ బుక్ చేసుకుని బయలుదేరారు.

ఆ తరువాత బ్రిటన్ జంట తమకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఒక ఎయిర్‌లైన్స్ సంస్థకు లేని నిబంధనలు మరో సంస్థ ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు. టీ మరక ఉన్నా కూడా పాస్‌పోర్టులోని కీలక వివరాలన్నీ సరిగానే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇష్టారీతిన నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పాస్‌పోర్టుతో నీనా అంతకుముందు కూడా ప్రయాణించిందని రోరీ పేర్కొన్నాడు. చిన్న టీ మరక పేరుతో తమను నేరస్తుల్లా ఎయిర్‌పోర్టు బయటకు తీసుకొచ్చారని వాపోయాడు. ఘటనపై రయానెయిర్ కూడా స్పందించింది. తాము నిబంధనల మేరకే నడుచుకున్నామని స్పష్టం చేసింది. రంగు మారిన పాస్‌పోర్టులు చెల్లవని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నట్టు వెల్లడించింది. అయితే, చెకిన్ కౌంటర్ సిబ్బంది ఆ జంటను లోపలికి అనుమతించడం మాత్రం తమ పొరపాటేనని అంగీకరించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
కూతుర్ని ఒడిలో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి.. జస్ట్ మిస
కూతుర్ని ఒడిలో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి.. జస్ట్ మిస
అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!
అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!
ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి..!
ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి..!
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
సినీ ఫక్కీలో వ్యక్తి దారుణ హత్య.. హంతకులను పట్టించిన పచ్చబొట్టు!
సినీ ఫక్కీలో వ్యక్తి దారుణ హత్య.. హంతకులను పట్టించిన పచ్చబొట్టు!
కొత్త పెళ్లి కొడుకునీ వదిలిపెట్టవా? ఓరి ముక్కు పిండేసిన అనంత్
కొత్త పెళ్లి కొడుకునీ వదిలిపెట్టవా? ఓరి ముక్కు పిండేసిన అనంత్
రూ.49తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్స్‌
రూ.49తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్స్‌
ముఖం పంది.. శరీరం చేప.. నెట్టింట జోరుగా వైరల్..
ముఖం పంది.. శరీరం చేప.. నెట్టింట జోరుగా వైరల్..
ఆ స్కూటీ డిక్కీని తెరిచి చూస్తే షాక్.. అసలు ట్విస్ట్ అదుర్స్..
ఆ స్కూటీ డిక్కీని తెరిచి చూస్తే షాక్.. అసలు ట్విస్ట్ అదుర్స్..
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం
పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఐఏఎస్‌ అధికారి భార్య నేరాలు..
గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఐఏఎస్‌ అధికారి భార్య నేరాలు..
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు
జఫ్రానీ ఛాయ్‌ ను ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా ?? రేటెంతో తెలుసా ??
జఫ్రానీ ఛాయ్‌ ను ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా ?? రేటెంతో తెలుసా ??