Ash Gourd: బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!

బూడిద గుమ్మడిలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. తరచుగా బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని సూచిస్తున్నారు. బూడిద గుమ్మడితో చేసిన జ్యూస్‌ క్రమం తప్పకుండా పరగడపునే తాగడం వల్ల అది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుంది. ఇది శరీరం లో చెడు కొలెస్ట్రాల్‌ చేరనీయకుండా కాపాడుతుంది.

Ash Gourd: బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!

|

Updated on: Jul 26, 2024 | 4:21 PM

బూడిద గుమ్మడిలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. తరచుగా బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని సూచిస్తున్నారు. బూడిద గుమ్మడితో చేసిన జ్యూస్‌ క్రమం తప్పకుండా పరగడపునే తాగడం వల్ల అది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుంది. ఇది శరీరం లో చెడు కొలెస్ట్రాల్‌ చేరనీయకుండా కాపాడుతుంది. బూడిద గుమ్మడిలో ప్రోటీన్లు, ఫైబర్‌, జింక్‌, కాల్షియం, ఐరన్‌తోపాటు విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6 వంటివి సమృద్ధిగా ఉన్నాయి.. ఇందులో 96 శాతం నీరు ఉండి డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలు నయమవుతాయి. మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది. రక్తహీనత నుంచి బయటపడేందుకు వీటిలోని ఐరన్‌ సాయపడుతుంది. పొట్టలో అల్సర్లు తగ్గుతాయి. కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. నిత్యం ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వివిధ రకాల వైరస్‌లు, బ్యాక్టీరియల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ జ్యూస్‌లో అధికంగా ఉండే విట‌మిన్ సీ, బీటా కెరోటిన్‌లు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి వాటితో బాధ‌ప‌డే వారు ఈ జ్యూస్ ను ప్రతీరోజూ తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్రశాంత‌త ల‌భిస్తుంది. ప్రతీరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్‌లో తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి నిద్రను పొందవచ్చు. రోజుకు మూడు గ్లాసుల బూడిద గుమ్మడి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల మూత్రపిండాల్లో రాళ్ల స‌మ‌స్యతో పాటు ఇత‌ర మూత్రపిండాల స‌మ‌స్యలు కూడా త‌గ్గుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం
పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఐఏఎస్‌ అధికారి భార్య నేరాలు..
గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఐఏఎస్‌ అధికారి భార్య నేరాలు..
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు
జఫ్రానీ ఛాయ్‌ ను ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా ?? రేటెంతో తెలుసా ??
జఫ్రానీ ఛాయ్‌ ను ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా ?? రేటెంతో తెలుసా ??
నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌
నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌
స్పేస్‌లో వీకాఫ్‌ ఎంజాయ్ చేసిన సునీతా విలియమ్స్‌
స్పేస్‌లో వీకాఫ్‌ ఎంజాయ్ చేసిన సునీతా విలియమ్స్‌
ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??
చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??