మందుబాబులకు సీఎం జగన్ సూచనలు

మందుబాబులకు సీఎం జగన్ సూచనలు

మద్యం దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాళ్లూ, చేతులూ వణకడం, రాత్రిళ్లు నిద్రపట్టక పోవడం వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు తాము చేసిన సూచనలు పాటించాలని చెప్పారు సీఎం జగన్. నిద్రపట్టని వాళ్లు పిల్లలతో ఆడుకోవడం..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 9:24 PM

కరోనా దెబ్బకి వైన్‌ షాపులన్నీ మూతపడ్డాయి. ఒక్కసారిగా షాపులు బంద్ కావడంతో మందుబాబులకు ఏం పాలుపోని స్థితి ఏర్పడింది. మద్యానికి మరీ బానిసైన వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చుక్క తాగితే కానీ బండి నడవని చాలా మంది ఇప్పుడు మద్యం కోసం పరితపిస్తున్నారు. కొందరైతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ.. డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్నారు. ఇక మరి కొందరైతే వైన్ షాపుల్లో చోరీలకు తెగబడుతున్నారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేక సమయాల్లో వైన్స్ షాపులను తెరిపిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. రెండు ప్రభుత్వాలూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అందులోనూ మద్యపాన నిషేధం దిశగా కఠిన చర్యలు తీసుకుంటోన్న ఏపీ ప్రభుత్వం.. మరింత ముందడుగేసి లాక్‌డౌన్‌ను అందుకు వేదికగా మలుచుకోవాలని చూస్తోంది. వీరి కోసం ప్రభుత్వ అధికారులే కాకుండా ఏపీ సీఎం జగన్ కూడా తాజాగా పలు సూచనలు చేశారు.

ఒక్కసారిగా మద్యం దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాళ్లూ, చేతులూ వణకడం, రాత్రిళ్లు నిద్రపట్టక పోవడం వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు తాము చేసిన సూచనలు పాటించాలని చెప్పారు సీఎం జగన్. నిద్రపట్టని వాళ్లు పిల్లలతో ఆడుకోవడం, టీవీ చూస్తూ కాలక్షేపం చేయాలని సూచించారు. తోట పని చేయడం, వ్యాయమం, తరుచూ నీళ్లు తాగడం, 8 నుంచి 9 గంటలు నిద్రపోవడం వల్ల మానసిక సమస్యలు దూరమవుతాయని వెల్లడించారు. అలాగే కాళ్లూ, చేతులూ వణికితే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కాగా మందు మానేయాలనుకునేవారికి లాక్‌డౌన్ ఒక వరమని, కుటుంబ ఆర్థి పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి:

సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారు

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu