ఆ నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ.. పార్టీ మారేందుకు వైసీపీ నేతలు రెఢీ..?

ఏపీలో ప్రభుత్వం మారింది. చిత్తూరు జిల్లాలో పొలిటికల్ సీన్ మారబోతోంది. ఈక్వేషన్స్ ఛేంజ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. వైసీపీ పవర్‎లో ఉన్నప్పుడు కుప్పం టార్గెట్‎గా పాలిటిక్స్ నడిస్తే.. ఇప్పుడు టిడిపి పుంగనూరును టార్గెట్ చేసింది. చిత్తూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే వినిపించే పేర్లు టిడిపి అధినేత చంద్రబాబు, వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి.

ఆ నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ.. పార్టీ మారేందుకు వైసీపీ నేతలు రెఢీ..?
Ycp and Tdp
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 28, 2024 | 6:35 PM

ఏపీలో ప్రభుత్వం మారింది. చిత్తూరు జిల్లాలో పొలిటికల్ సీన్ మారబోతోంది. ఈక్వేషన్స్ ఛేంజ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. వైసీపీ పవర్‎లో ఉన్నప్పుడు కుప్పం టార్గెట్‎గా పాలిటిక్స్ నడిస్తే.. ఇప్పుడు టిడిపి పుంగనూరును టార్గెట్ చేసింది. చిత్తూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే వినిపించే పేర్లు టిడిపి అధినేత చంద్రబాబు, వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి. ఈ ఇద్దరి మధ్య వైర్యం యూనివర్సిటీ స్థాయి నుంచే ఉంది. దాదాపు 5 దశాబ్దాలుగా ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. అయితే 2019 తరువాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి 5 ఏళ్లపాటు మంత్రిగా రాజకీయంగా చక్రం తిప్పారు. రాయలసీమలో తిరుగులేని నేతగా కొనసాగారు. కుప్పం టార్గెట్‎గా పాలిటిక్స్‎లో హీట్ పెంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా కుప్పంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యత సాధించేలా కృషి చేశారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పెద్దిరెడ్డి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పైచెయ్యి సాధించారు.

ఇందులో భాగంగానే కుప్పం మున్సిపాలిటీని వైసీపీ చేజిక్కించు కోవడం స్టేట్ పాలిటిక్స్‎లో పెద్ద చర్చకు దారి తీసింది. కుప్పంలో వైసీపీ దూకుడు టిడిపి అధినేత చంద్రబాబును సైతం రాజకీయంగా ఇబ్బంది పెట్టింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ దీటైన పోటీ ఇచ్చేందుకు సర్వ శక్తులు ఓడ్డింది. అయితే కుప్పం ఓటర్లు మాత్రం చంద్రబాబుకు తిరుగులేని విజయాన్ని అందించారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్న చంద్రబాబుకు ఎనిమిదో విజయాన్ని అందించారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారిపోగా నాలుగోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గ ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజులు సొంత నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు కుప్పంలో పార్టీ కేడర్‎తో మమేకమయ్యారు. కుప్పంలో టిడిపిని మరింత పటిష్టం చేసేందుకు శ్రీకారం చుట్టారు. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా 2024 లో బరిలో దిగిన టిడిపి అధినేత చంద్రబాబు మెజారిటీ లక్ష్యం చేరుకోకపోవడంపై దృష్టి పెట్టారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందంటూ క్లస్టర్ వైజ్ సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు.. కుప్పంపై ఫోకస్ పెంచారు. దీంతో పార్టీలోకి వలసలు షురూ అయినట్టు కేడర్ భావిస్తుండగా ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న కుప్పం వైసీపీ నేతలు టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆపరేషన్ ఆకర్ష్ జరిగే అవకాశం ఉందని కేడర్ అంచనా వేస్తోంది. అయితే ఈలోపు చిత్తూరు జిల్లాలో సీన్ రివర్స్ అయ్యిందన్న విషయం పుంగనూరు నుంచి ప్రారంభమైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో మొదలైన వలసలు ఇందుకు సంకేతం అన్నట్లు పరిస్థితి మారింది. పుంగనూరు మున్సిపాలిటీపై అధికార టిడిపి దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. త్వరలో టిడిపి గూటికి చేరేలా పుంగనూరు మున్సిపల్ చైర్మన్‎తోపాటు 13 మంది కౌన్సిలర్లు వెళ్లేందుకు వైసీపీకి రాజీనామా చేసారు. మున్సిపల్ చైర్మన్ ఆలీం భాష, కౌన్సిలర్లు రొంపిచర్లలో పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులను ఏకగ్రీవ ఎన్నికతో కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు పట్టు కోల్పోతున్నట్లు స్పష్టం అవుతోంది.

2005 నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పుంగనూరు మున్సిపాలిటీ ఉండగా.. రాష్ట్రంలో అధికారం మారడంతో వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మార్పుకు కారణమని తెలుస్తోంది. టిడిపి అధికారంలోకి రావడంతో పార్టీ ఫిరాయింపుకు సిద్ధమైన వైసీపీ కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందని చెబుతున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో కౌన్సిల్‎కు అధికారమివ్వకుండా పెద్దిరెడ్డినే పెత్తనం చెలాయించారన్న కౌన్సిలర్ల ఆరోపణలు పెద్ద చర్చకు దారితీసింది. సీఎం చంద్రబాబుతో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో టిడిపిలో చేరికకు పుంగనూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు సిద్ధం కావడం చూస్తే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి టార్గెట్‎గా టిడిపి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్లయ్యింది. అప్పుడు వైసీపీకి కుప్పం టార్గెట్ అయితే ఇప్పుడు టిడిపికి పుంగనూరు టార్గెట్‎గా మారినట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీ చేతిలో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీపై కూడా టిడిపి పట్టు సాధించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. 19 మంది వైసీపీ కౌన్సిలర్లు, 6 మంది టిడిపి కౌన్సిలర్లు ఉన్న కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ అధికారం సాధించాలని భావిస్తోంది. అందులో భాగంగా వైసీపీ కౌన్సిలర్లను ఆకర్షించే విధంగా పావులు కదుపుతోందన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..