గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించిన తాత.. ఎడ్ల బండిపై ఆకట్టుకున్న మనవడు..!
తిరుపతి జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ జోష్ కొనసాగుతోంది. పెద్దపండుగకు నాలుగు రోజులు పాటు నారావారిపల్లిలోనే బసచేసిన నారా-నందమూరి కుటుంబాలు సంక్రాంతిని సందడిగా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నారావారిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

ఒకవైపు పార్టీ కార్యకర్తలతో మరోవైపు అలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సీఎం ఇంటి వద్ద హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు జరగ్గా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు సీఎం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లి లో సీఎం ఇంట సంక్రాంతి వేడుకలు జరిగాయి.
మరోవైపు నారావారిపల్లిలో ఎడ్ల బండిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, తన మనువళ్ల ముచ్చట చూశారు. సీఎం చంద్రబాబు సంక్రాంతి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. నారా వారిపల్లిలో సీఎం మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ సరదాగా ఎడ్లబండిపై తిరుగుతూ అందరిని ఆకట్టుకున్నారు. గ్రామంలోని వీధుల్లో ఎడ్లబండిపై స్వారీ చేసిన దేవాన్ష్‌ను చూసిన స్థానికులు మురిసిపోయారు. ఉత్సాహంతో జై బాలయ్య నినాదాలు చేస్తూ.. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సందడి చేశారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..