AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నో కోడి పందాలు.. సంక్రాంతికి అక్కడ గుర్రాల పోటీలు స్పెషల్.. వీడియో చూశారా..?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అనకాపల్లిలోని ఆ పల్లెలో గుర్రాలు దౌడు తీస్తాయి. పోటీ పడుతూ పరిగెడతాయి. నువ్వా నేనా అన్నట్టు ముందుకు దూసుకుపోతాయి. రాజసాన్ని ఉట్టిపడేలా ఆ గుర్రాల పరుగులు పెడుతూ ఉంటే జనాల కేరింతలతో ఆ పోటీలు ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి.

Andhra: నో కోడి పందాలు.. సంక్రాంతికి అక్కడ గుర్రాల పోటీలు స్పెషల్.. వీడియో చూశారా..?
Anakapalli Sankranti Horse Races
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jan 16, 2026 | 12:19 PM

Share

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అనకాపల్లిలోని ఆ పల్లెలో గుర్రాలు దౌడు తీస్తాయి. పోటీ పడుతూ పరిగెడతాయి. నువ్వా నేనా అన్నట్టు ముందుకు దూసుకుపోతాయి. రాజసాన్ని ఉట్టిపడేలా ఆ గుర్రాల పరుగులు పెడుతూ ఉంటే జనాల కేరింతలతో ఆ పోటీలు ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి. కోనసీమ కోడిపందాలకు కేరాఫ్ అయితే.. అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా గుర్రాల పోటీలు సాగిపోతూ ఉన్నాయి. కోడిపందాలు, ఎడ్ల పోటీలు కామన్.. కానీ పండక్కి అనకాపల్లి జిల్లాలో గుర్రాల పోటీలకు ప్రత్యేకత. స్థానిక సర్పంచులు నేతల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ పోటీలో నిర్వహిస్తూ జనాల్లో ఉత్సాహం పెంచుతారు. మునగపాక మండలం ఉమ్మలాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

పోటీలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 30 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే గుర్రాలకు ఆరు బహుమతులు అందజేస్తున్నారు. తొలి బహుమతి 12,000, ద్వితీయ బహుమతి 10000, తృతీయ స్థానంలో నిలిచిన గుర్రానికి ఎనిమిది వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నారు. గుర్రాల పోటీలు చూసేందుకు భారీగా చేరుకున్నరు జనం.

అలాగే.. బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్టలో ఉత్సాహంగా సంక్రాంతి రోజు గుర్రాల పోటీలు సాగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 10 గుర్రాలు పోటీపడ్డాయి. గుర్రాలు పరుగులు తీస్తూ ఉంటే కేరింతలు కొడుతున్నారు జనం. తమ ఫేవరెట్ గుర్రానికి ఎంకరేజ్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ సంక్రాంతికి.. అనకాపల్లి జిల్లాలో.. ఎడ్ల పోటీలు, పుట్ల పోటీలతో పాటు.. గుర్రం పోటీలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందుకే కేవలం అనకాపల్లి జిల్లా నుంచి కాదు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం ఈ పోటీలను చూసేందుకు తరలివస్తుంటారు. పోటీల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్