Janasena: దుర్గమ్మ సాక్షిగా.. పట్టుచీర కోసం సిగపట్లు పడుతున్న జనసైనికులు.. కారణం ఏంటంటే..
గ్రీన్ అంచు.. రెడ్ శారీ.. ఇప్పుడు జనసేనలో బ్లడ్ బాయిల్ అయ్యేలా డైలాగ్ వార్‌కు దారి తీస్తోంది. నేతల మధ్య కల్లోలం రేపుతోంది. ఓ పట్టుచీర కోసం నేతలు ఫైట్లకు దిగుతున్నారు.

గ్రీన్ అంచు.. రెడ్ శారీ.. ఇప్పుడు జనసేనలో బ్లడ్ బాయిల్ అయ్యేలా డైలాగ్ వార్‌కు దారి తీస్తోంది. నేతల మధ్య కల్లోలం రేపుతోంది. ఓ పట్టుచీర కోసం నేతలు ఫైట్లకు దిగుతున్నారు. బెజవాడ దుర్గమ్మకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమర్పించిన పట్టుచీర.. ఇప్పుడు అదే పార్టీలో సిగపట్లకు దారితీస్తోంది. నిన్నటిదాకా దుర్గమ్మకు పవన్ సమర్పించిన పట్టుచీరను ఆక్షన్ వేస్తే దక్కించుకోవడానికి పోటీ పడ్డ జనసేన నేతలు.. ఇప్పుడు ఆ చీర సాక్షిగా గొడవలకు దిగుతున్నారు. చీర నాకివ్వకపోతే చీరేస్తా అనే దాకా గొడవలు వెళ్లాయంటే మేటర్ ఎంత సీరియస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. దుర్గమ్మ సాక్షిగా నేతలు తగ్గేదే లా అంటూ గొడవకు దిగుతున్నారు. చీర నాకంటే నాకంటూ తిట్టుకునే స్థాయి దాకా వెళ్లిపోతున్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి స్వరూప, విజయవాడ పార్టీ ఇన్‌చార్జి పోతిన మహేష్ మధ్య ఇప్పుడు ఈ చీర చిచ్చు రగులుతోంది.
తాజాగా గంటా స్వరూప అనే జనసేన నాయకురాలు.. విజయవాడ దుర్గ గుడిలో శారీ కౌంటర్‌కు వెళ్లారు. అమ్మవారికి పవన్ సమర్పించిన గ్రీన్ బోర్డర్, రెడ్ కలర్ పట్టుచీరను కొనడానికి వెళ్లారు. ఆ చీరను కొని పవన్‌కు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. శారీ ఆక్షన్ కౌంటర్ దగ్గర కాంట్రాక్టర్‌తో మాట్లాడి చీర కొనడానికి సిద్ధమయ్యారు.
ఇంతలో జనసేన నేత పోతిన మహేష్ రంగంలోకి దిగారు. స్వరూప చీరను తీసుకుని బిల్లింగ్ చేస్తున్న సమయంలోనే దేవాలయ కాంట్రాక్టర్ కు ఫోన్ చేశారు పోతిన. విజయవాడ దుర్గ గుడి తన నియోజకవర్గం పరిధిలోకి వస్తుందంటూ ఆయన హల్‌చల్ చేశారు. ఆ చీరను తానే కొని పవన్‌కు అందజేస్తాను అని దేవాలయ కాంట్రాక్టర్‌కు మహేష్ చెప్పారు.




ఈవో ద్వారా చీరను తనకే ఇవ్వాలంటూ మహేష్ చెప్పడంతో స్వరూప నుంచి ఆ చీరను తిరిగి తీసేసుకున్నారు ఆలయ సిబ్బంది. దీంతో స్వరూప అలిగారు. పార్టీలో గొడవలు వద్దంటూ చీరను అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయారు. దీంతో ఆ చీర మళ్లీ ఈవో రూమ్‌కి చేరింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..