భలే మంచి చౌక భేరం.. తక్కువ ధరకే బంగారు నాణేలు.. చివరకు ఉల్టా ఫుల్టా
బళ్లారి రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఒక రైతు వీరికి వద్దకు వచ్చాడు. తన వద్ద నున్న రెండు మూటలను వారికి ఇచ్చాడు. వారు వెంటనే వాటిని విప్పి చూసేందుకు ప్రయత్నం చేయగా వెంకటేష్ వారించాడు. రైల్వే స్టేషన్ లో అనుమానం వస్తే అందరం బుక్ అవుతామని చెప్పి గుంటూరు బయలు దేరదీసాడు. గుంటూరు రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత వెంకటేష్ చిన్నగా అక్కడ నుండి జారుకున్నాడు.

గుంటూరులోని ఏటి అగ్రహారం… వెంకట రెడ్డి, కొండలు ఇద్దరూ స్నేహితులు… రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్‌తో కూడా వీరికి పరిచయం ఉంది. గత నెల పదిహేడో తేదిన వెంకటేష్…. రియల్ ఎస్టేట్ వ్యాపారులను కలిశాడు. తన వద్ద బంగారు నాణేలు ఉన్నాయని బళ్లారికి చెందిన ఒక రైతు తక్కువ ధరకే వాటిని తనకు ఇచ్చినట్లు చెప్పాడు. అంతే కాదు టెస్టింగ్ కోసమని రెండు నాణెలు కూడా ఇచ్చాడు.
ఆ నాణెలు తీసుకున్న స్నేహితులిద్దరూ వాటిని టెస్ట్ చేయించగా బంగారు నాణెలుగానే తేలింది. దీంతో వీరివురూ మరోసారి వెంకటేష్‌ను కలిశారు. అయితే వెంకటేష్ బళ్లారిలో ఉన్న రైతు వద్దకు వెళ్ళాలని.. అక్కడ అతని పొలంలో దున్నిన తర్వాతే బంగారు నాణెలు వస్తాయని నమ్మబలికాడు. ఇందు కోసం మొదటగా ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పాడు. వెంకటేష్ మాటలు నమ్మిన స్నేహితులు తొలి విడతగా ఐదు లక్షల రూపాయల ఇచ్చారు. అనంతరం ముగ్గురు కలిసి బళ్లారి వెళ్లారు.
బళ్లారి రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఒక రైతు వీరికి వద్దకు వచ్చాడు. తన వద్ద నున్న రెండు మూటలను వారికి ఇచ్చాడు. వారు వెంటనే వాటిని విప్పి చూసేందుకు ప్రయత్నం చేయగా వెంకటేష్ వారించాడు. రైల్వే స్టేషన్ లో అనుమానం వస్తే అందరం బుక్ అవుతామని చెప్పి గుంటూరు బయలు దేరదీసాడు. గుంటూరు రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత వెంకటేష్ చిన్నగా అక్కడ నుండి జారుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారులిద్దరూ మూటలు విప్పి చూడగా బంగారు నాణెలకు బదులుగా ఇత్తడి నాణెలున్నట్లు తేలింది.
వెంటనే వెంకటేష్‌ను పట్టుకొని తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే డబ్బులిచ్చేందుకు వెంకటేష్ నిరాకరించాడు. మరోవైపు రైతు వేషంలో వచ్చిన వ్యక్తి కూడా వెంకటేష్ మనిషేనని తర్వాత తెలుసుకున్నారు. కావాలనే పక్కా ప్రణాళికతో వెంకటేష్ మోసం చేశాడని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. బాధితులు మాత్రం వెంకటేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతం వాడేనని నమ్మినందుకు మోసం చేసినట్లు వాపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
