Nara Bhuvaneswari: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. గతంలో చంద్రబాబు శపథం చేసిన దృశ్యాలు, తాజాగా గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో షేర్ చేశారు..

Nara Bhuvaneswari: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్..
Nara Bhuvaneswari
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 21, 2024 | 3:52 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. గతంలో చంద్రబాబు శపథం చేసిన దృశ్యాలు, తాజాగా గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో షేర్ చేశారు..  చంద్రబాబు శపథం. 2021లో ఓ పెద్ద సంచలనం. అప్పటి ప్రభుత్వ ఎమ్మెల్యేల తీరు నచ్చక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సీఎంగా మళ్లీ సభలో అడుగు పెడుతానంటూ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి రెండున్నరేళ్ల అసెంబ్లీకి వెళ్లలేదు. ఏపీలో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు సభలో అడుగుపెట్టారు. అప్పటి శపథాన్ని తన ట్వీట్‌కు జోడించారు భువనేశ్వరి.

నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. చంద్రబాబునాయుడు ఇవాళ గౌరవ సభలో అడుగుపెట్టారంటూ ట్వీట్ ద్వారా తెలియజేశారు భువనేశ్వరి. ప్రజలకు ప్రణామం అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రమాణాన్ని భువనేశ్వరి టీవీలో వీక్షించారు.

అసెంబ్లీలో సందడి..

ఇదిలాఉంటే.. ఏపీ అసెంబ్లీ తొలిరోజు సభ్యుల కరచాలనాలు, పలకరింపులతో సందడిగా కనిపించింది. ప్రమాణస్వీకారం తర్వాత కూటమి సభ్యులంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవడం, పరస్పరం శుభాకాంక్షలు- అభినందనలతో పండగ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులుంటే.. ఇందులో 135 మంది TDP వారే. తర్వాత జనసేన నుంచి 21 మంది సభ్యులు ఉన్నారు. BJP నుంచి 8 మంది గెలిచారు. ఈ కూటమి సభ్యులు కాకుండా YCP నుంచి 11 మంది MLAలు సభలో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన 11 మంది సభకు హాజరై ప్రమాణం చేశారు. మాజీ సీఎం జగన్‌ శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..