AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటోనని తలుపు తీసి చూడగా ప్రాణం పోయేంతపనైంది.. పరుగో పరుగు..

అడవులు, చెట్లు, పొదల్లో ఉండాల్సిన జీవరాశులు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసమో.. లేక వాటి నివాసాలకు భంగం కలిగో.. ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా విశాఖ దువ్వాడలో.. ఓ విషపూరితమైన పాము కలకలం రేపింది. వాష్ రూమ్‌లో వెళ్ళి అందర్నీ కంగారెత్తించింది.

బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటోనని తలుపు తీసి చూడగా ప్రాణం పోయేంతపనైంది.. పరుగో పరుగు..
Snake
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 21, 2024 | 4:23 PM

Share

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రసాలమ్మ కాలనీ..! ఓ ఇంట్లో కుటుంబం నివాసం ఉంటోంది. ఇంట్లో.. వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇల్లంత వెతికితే ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇక వాష్ రూమ్ తలుపు దగ్గరకు వెళ్లేసరికి ఆ శబ్దాలు మరింత పెద్దగా వినిపిస్తున్నాయి. దీంతో నెమ్మదిగా వాష్ రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగేంత పని అయింది. దీంతో ఒక్కసారిగా పరుగులు తీశారు ఆ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు.. వాళ్లు చూసినది ఏంటో తెలుసా..? నాలుగున్నర అడుగుల గోధుమ నాగు.. బుసలు కొడుతూ రెప్పపాటులో కాటేసేలా ఉంది. దీంతో అమ్మో అనుకున్న వారు పరుగులు తీశారు.. చివరకు ఈ విషయాన్ని ఇరుగుపొరుగుకు చెప్పారు. వెంటనే పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్స్ సేవర్ సొసైటీ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. తన బృందంతో కలిసి రంగంలోకి దిగిన కిరణ్ కుమార్.. వాష్ రూమ్ కు వెళ్లాడు. అక్కడ తిష్ట వేసి ఉన్న భారీ గోధుమనాగును చాకచక్యంగా పట్టుకున్నాడు. బంధించే క్రమంలో ఎదురు తిరిగేందుకు ప్రయత్నించింది ఆ పాము. చివరకు ఆ పామును గోనెసంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ గోధుమ నాగు అత్యంత విషపూరితమని స్థానికులు తెలిపారు.

గోధుమ నాగు వీడియో..

గోధుమనాగు వయసును బట్టి..

వాస్తవానికి పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. రక్త పింజరి, కట్లపాము, జర్రిగొడ్డు, తాచుపాము, కొండచిలువ ఇలా ఎన్నో రకాలు వేర్వేరు చోట్ల కనిపిస్తూ ఉంటాయి. వాటిలో నాగుపాము మూడు వర్ణాల్లో మనకు కనిపిస్తుందని అంటున్నారు. గోధుమ రంగులో ఉండే నాగు పాములు ఎపిలోనే ఉంటాయట..! తలపై నమాకృతిని కలిగి గోధుమ, ముదురు కాఫీ రంగు చారలు కలిగి ఉంటాయి. వయసును బట్టి ఇవి 20 అంగుళాల మొదలుకొని… దాదాపు 9 అడుగుల వరకు పెరుగుతాయి. విశేషమేంటంటే.. వీటికి తోకలో ఉండే చిన్న ముళ్ళలోనూ విషం కలిగి ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..