వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరి మధ్యే పోటీ.. MLC ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభుత్వానికి టీపీడీ షాకిచ్చింది. అయితే ఈ సందర్భంగా టీడీపీకి మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభుత్వానికి టీపీడీ షాకిచ్చింది. అయితే ఈ సందర్భంగా టీడీపీకి మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఓటు అనే ఆయుధంతో అంబేద్కర్ స్పూర్తితో ఓట్లేశారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ద్వారా అధికార ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటారని ఉద్ఝాటించారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును తిరుగుబాటుగా చూడాలని కోరారు. ఉగాది పంచాంగాన్ని రెండు రోజుల ముందే ప్రజలు చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఇక జగన్ వర్సెస్ పబ్లిక్ అని పేర్కొన్నారు.
జగన్ అరచకాలు కొనసాగాలా లేక రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. చివరికి పులివెందుల్లో కూడా తిరుగుబాటు మొదలైందని తెలిపారు. వైసీపీ నేతలు అధికారులను.. పారిశ్రామిక వేత్తలను జైళ్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్రైం లో భాగస్వాలను చేయాలని చూస్తుననారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం గాలికి వచ్చిన పార్టీ అని చురకలంటించారు. గాలికి వచ్చిన పార్టీ గాలికే కొట్టుకుపోతుందని ఎద్దేవా చేశారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం




