AP – Telangana: తెలుగు రాష్ట్రాలకు మరో 24గంటలపాటు డేంజర్‌ అలర్ట్‌.. పలుచోట్ల పిడుగులు

తెలంగాణతో పాటు ఏపీకి మరో 24గంటల పాటు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

AP - Telangana: తెలుగు రాష్ట్రాలకు మరో 24గంటలపాటు డేంజర్‌ అలర్ట్‌.. పలుచోట్ల పిడుగులు
Weather Alert
Follow us

|

Updated on: Mar 19, 2023 | 2:59 PM

తెలుగు స్టేట్స్‌కి ఇంకా ముప్పు పొంచే ఉంది.  దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి జార్ఖండ్ వరకు గల ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక & మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది. దీంతో మరో 24గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. ఉన్నట్టుండి క్యుములోనింబస్‌ మేఘాలు విరుచుకుపడే అవకాశముందని అలర్ట్‌ ఇష్యూ చేసింది. పెనుగాలులు, వడగళ్ల వానతోపాటు పిడుగులు పడేఛాన్స్‌ ఉందంటోంది వెదర్ డిపార్ట్‌మెంట్‌. అకాల వర్షాలపై ఏపీ అప్రమత్తమైంది. వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులను అలర్ట్‌ చేశారు సీఎం జగన్‌. ఉన్నట్టుండి విధ్వంసం సృష్టిస్తోన్న రాళ్ల వర్షంపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. రాళ్ల వానకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయ్‌. వేలాది ఎకరాల్లో మిర్చి, అరటి, వరి, మామిడి, మొక్కజొన్న పంటలు నేలపాలైపోయాయి. చేతికందొచ్చిన పంట కళ్లెదుటే మట్టిపాలు కావడంతో గుండెలు బాదుకుంటున్నారు రైతన్నలు. దాదాపు తెలంగాణ అంతటా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా కనబడుతోంది.

ఏపీలోనూ వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ్‌. ఉమ్మడి అనంతపురం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నష్టం జరిగింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :– —————————–

ఆదివారం:-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

మంగళవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————–

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో) వీచే అవకాశం ఉంది.

మంగళవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :- —————-

ఆదివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది

సోమవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

మంగళవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం