AP Politics: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం.. ముందు బాబు, తర్వాత సీఎం జగన్.. అమిత్ షాతో వరుస భేటీలు

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేడు సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోనూ జగన్‌ భేటీ అయ్యే అవకాశముందని వైసీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాగానే జరుగుతున్న జగన్‌ హస్తిన పర్యటన హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హస్తినలో పర్యటిస్తున్నారు.

AP Politics: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం.. ముందు బాబు, తర్వాత సీఎం జగన్.. అమిత్ షాతో వరుస భేటీలు
Cm Jagan Visits Delhi
Follow us
Srikar T

|

Updated on: Feb 09, 2024 | 8:00 AM

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేడు సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోనూ జగన్‌ భేటీ అయ్యే అవకాశముందని వైసీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాగానే జరుగుతున్న జగన్‌ హస్తిన పర్యటన హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హస్తినలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీ కరణ నిలుపుదల, పోలవరానికి నిధులతో పాటు జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు రాజకీయపరమైన చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా జగన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసే అవకాశముందని వైసీపీ వర్గాలు తెలిపాయి. షర్మిల చేపట్టిన ప్రత్యేక హోదా నిరసన స్వరంతో జగన్ పర్యటన రాష్ట్రానికి ప్రయోజనకరంగా మారుతుందా అన్న ఆసక్తినెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్‌ హస్తినలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయడం లేదని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. వైసీపీ-టీడీపీ-బీజేపీ మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు బీజేపీ నేత సుజనా చౌదరి. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఏపీ నేతల హస్తిన పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. రానున్న రోజులు ఎవరు ఎవరితో పొత్తులో కొనసాగుతారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..