Andhra Pradesh: తాగొచ్చి గొడవ చేస్తున్నాడనీ.. ప్రియుడితో కలిసి కొడుకును హత మార్చిన కసాయి తల్లి!
అతనేమి చిన్నపిల్లాడు కాదు. ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుంది. అయితే మద్యానికి బానిసై స్వంత తల్లిపైనే గొడవకు దిగుతుండేవాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి ఆమె ప్రియుడు సాయం తీసుకొంది. ఇద్దరూ కలిసి కొడుకును హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పోలీసులు వారిద్దని అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటలో ఉండే జరీనా బేగం మిరపకాయల తొడిమెలు తీసే కూలి పనికి వెళ్లేది. జరీనా బేగం భర్త కొద్దీ కాలం కిందట చనిపోయాడు. అప్పటి నుండి కొడుకు సుభానితో కలిసి ఆమె జీవిస్తుంది..
గుంటూరు, ఫిబ్రవరి 8: అతనేమి చిన్నపిల్లాడు కాదు. ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుంది. అయితే మద్యానికి బానిసై స్వంత తల్లిపైనే గొడవకు దిగుతుండేవాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి ఆమె ప్రియుడు సాయం తీసుకొంది. ఇద్దరూ కలిసి కొడుకును హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పోలీసులు వారిద్దని అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటలో ఉండే జరీనా బేగం మిరపకాయల తొడిమెలు తీసే కూలి పనికి వెళ్లేది. జరీనా బేగం భర్త కొద్దీ కాలం కిందట చనిపోయాడు. అప్పటి నుండి కొడుకు సుభానితో కలిసి ఆమె జీవిస్తుంది. అయితే జరీన బేగంకు కొద్దీ కాలం కిందట వెంగళాయపాలెంకు చెందిన బాజీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం యుక్త వయస్సులో ఉన్న కొడుకు సుభానీ కూడా తెలుసు. అయితే మద్యం సేవించి వచ్చినప్పుడు సుభాని తల్లితో గొడవ పడుతుండేవాడు.
మిరప కాయల పనికి వెళ్లి వచ్చిన డబ్బులను జరీనా బాజీకి ఇవ్వటాన్ని సుభానీ తట్టుకోలేకపోయేవాడు. ఇంటిలో బాజీతో కలిసి సుభానీ కూడా మద్యం సేవించే వాడు. ఆ తర్వాత తల్లితోనూ, బాజీతోనూ గొడవ పడేవాడు. ఇద్దరిపై దాడి కూడా చేసేవాడు. ఈక్రమంలోనే సుభానీ వేధింపులు తాళలేక అతని పీడ వదిలించుకోవాలని జరీనా భావించింది. ఈ విషయాన్ని బాజీతో కూడా చెప్పింది. రెండు రోజుల క్రితం మద్యం తాగొచ్చిన సుభాని ఇంటికి వచ్చి తల్లితోనూ, బాజీతోనూ ఘర్షణ పడ్డాడు. ఇదే అదునుగా భావించిన వారిద్దరూ ఇంటిలోనే రోకలిబండతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుభానీ అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ విషయం బయటకు తెలియకముందే పారిపోవాలని నిందితులు భావించారు. అక్కడ నుండి దూరంగా వెళ్లిపోయారు. అయితే పోలీసుల దర్యాప్తులో తల్లే ప్రియుడితో కలిసి సుభానీని హతమార్చినట్లు తేలింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.