చిన్నారి ఆడుకుంటుండగా పెద్ద శబ్ధం.. గ్రామస్థులను షాక్‎కు గురిచేసిన ఘటన..

సెల్ ఫోన్ బ్యాటరీతో ఆడుకుంటూ ఉండగా బ్యాటరీ పేలింది. దీంతో చేతికి తీవ్రగాయం అయి రెండు వేళ్లు తెగిపోయాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీ గూడెంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. కుంచాల వెంకటేశ్వరావు ఇంటి ముందు పదకొండేళ్ళ చిన్నారి ఆడుకుంటుంది. చేతిలో ఏదో ఆట వస్తువు ఉందనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా.

చిన్నారి ఆడుకుంటుండగా పెద్ద శబ్ధం.. గ్రామస్థులను షాక్‎కు గురిచేసిన ఘటన..
Cell Phone Battery
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 21, 2024 | 12:53 PM

సెల్ ఫోన్ బ్యాటరీతో ఆడుకుంటూ ఉండగా బ్యాటరీ పేలింది. దీంతో చేతికి తీవ్రగాయం అయి రెండు వేళ్లు తెగిపోయాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీ గూడెంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. కుంచాల వెంకటేశ్వరావు ఇంటి ముందు పదకొండేళ్ళ చిన్నారి ఆడుకుంటుంది. చేతిలో ఏదో ఆట వస్తువు ఉందనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. అయితే ఆ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు శబ్దం చుట్టుపక్కల చాలా దూరం వరకు వినిపించింది. పేలుడు జరిగిన వెంటనే చిన్నారి చేతికి తీవ్ర గాయం అయింది. చేతి రెండు వేళ్లు తెగి పోయాయి. ప్రస్తుతం ఆ బాలిక గుంటూరు జిజిహెచ్‎లో చికిత్స పొందుతుంది.

ఆ చిన్నారి పేరు వరలక్ష్మీ. స్థానిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. సాయంత్రం ఇంటి దగ్గర ఒక సెల్ ఫోన్ పాత బ్యాటరీ దొరికింది. అది ఏదో ఆట వస్తువుగా భావించిన ఆ చిన్నారి దాన్ని తీసుకొని ఆడుకుంది. కొద్దిసేపటి తర్వాత అందులో ఏదో ఉందనుకుని దాన్ని రాయితో కొట్టడం మొదలు పెట్టింది. రెండు మూడు సార్లు కొట్టగానే ఒక్కసారిగా బ్యాటరీ పెద్ద శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి చిన్నారి చేతికి తీవ్ర గాయం అయింది. చేతి వేళ్లు చిద్రం అయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు చికిత్స కోసం బాలికను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక చేతికి తీవ్ర గాయం అయి రక్తస్రావం కావడంతో ఆ చిన్నారిని గుంటూరు జిజిహెచ్‎కు తరలించారు. చేతికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు మరో పది రోజుల పాటు చికిత్స అవసరమని చెప్పారు. అయితే పాత బ్యాటరీలతో ఆడుకోవటం ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తుంది. అందుకే చిన్న పిల్లలకు ఎలక్ట్రానిక్ పరికరాలు, పాత పడ్డ బ్యాటరీలు, సెల్ ఫోన్లు ఇవ్వకుండా వారికి దూరంగా భద్రపరచడం మంచిది. తద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ