చంద్రబాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ వేయడంతో చంద్రబాబు ఆస్తులు- అప్పులు వ్యవహారం బట్టబయలు అవుతోంది. గత ఎన్నికల నాటికి.. ఇప్పటికి చంద్రబాబు ఆస్తులు 39శాతం పెరగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. 2019లో చంద్రబాబు ఆస్తుల విలువ ఎంత?.. ఇప్పుడు ఎంత?.. 39 శాతం పెరుగుదల వెనకున్న లాజిక్‌ ఏంటి?

చంద్రబాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు..
Chandrababu Bhuvaneshwari
Follow us

|

Updated on: Apr 21, 2024 | 9:30 AM

టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ వేయడంతో చంద్రబాబు ఆస్తులు- అప్పులు వ్యవహారం బట్టబయలు అవుతోంది. గత ఎన్నికల నాటికి.. ఇప్పటికి చంద్రబాబు ఆస్తులు 39శాతం పెరగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. 2019లో చంద్రబాబు ఆస్తుల విలువ ఎంత?.. ఇప్పుడు ఎంత?.. 39 శాతం పెరుగుదల వెనకున్న లాజిక్‌ ఏంటి?

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రచారం.. మరోవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. పలువురు ప్రముఖలు ఆస్తుల వ్యవహారం బట్టబయలు అవుతోంది. తాజాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా.. చంద్రబాబుకు సంబంధించి ఎన్నికల అధికారులకు ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. దాంతో.. 2019-2024 మధ్య కాలంలో చంద్రబాబు ఆస్తులు 39 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. తనకు, తన భార్యకు కలిపి రూ.931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఇచ్చిన అఫిడవిట్‌లోనే చంద్రబాబు ఆస్తులకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఆస్తుల విలువ 39 శాతం పెరిగింది. ఈ ఆస్తుల్లో రూ.668 కోట్లు నారా భువనేశ్వరి పేరిట ఉన్నాయి. ఆయా ఆస్తులను హెరిటేజ్ ఫుడ్స్, నిర్వాణ హోల్డింగ్స్ లాంటి సంస్థల్లో భువనేశ్వరి పెట్టుబడులుగా చూపించారు. వీటితో పాటు భువనేశ్వరి దగ్గర రూ.3 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నాయి. ఇక.. స్థిరాస్తుల విషయానికొస్తే.. భువనేశ్వరికి హైదరాబాద్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు, పొలాలు ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి మొత్తాన్ని చంద్రబాబు పేరిట చూపించారు.

ఇదిలావుంటే.. 2019 నామినేషన్‌ సమయంలో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తులు రూ.668 కోట్లు ఉన్నాయి. 15 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఆ లెక్కన.. 2014- 2019 మధ్య చంద్రబాబు ఆస్తులు రూ.491 కోట్ల మేర పెరిగాయి. దాంతో.. 2019లో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు చంద్రబాబు. అయితే.. తాజా ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో ఆస్తి విలువను రూ.931 కోట్లుగా చూపించడంతో ఈ ఐదేళ్లలో చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తి విలువ 39శాతం పెరిగినట్లు అయింది. మొత్తంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తులు ఐదేళ్లకు ఒకసారి భారీగా పెరుగుతున్నాయి. ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌తో చంద్రబాబు దంపతుల ఆస్తుల వ్యవహారం బహిర్గతం అవుతోంది. అయితే.. ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆస్తుల విలువ రాకెట్‌ వేగంతో వందల కోట్లలో పెరుగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…