AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. రెండు కిలోమీటర్లు గర్బిణీని మోసుకెళ్ళిన కుటుంబసభ్యులు.!

ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు, తండాలు అభివృద్ధికి నోచుకోవా? రోడ్డు మార్గం అందని కలేనా? అనారోగ్యం పాలైతే డోలియే మార్గామా? అక్కడి జనం కష్టాలు చూస్తుంటే.. ఇంతేనా అనిపిస్తోంది. ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది.

Andhra Pradesh: ఆ గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. రెండు కిలోమీటర్లు గర్బిణీని మోసుకెళ్ళిన కుటుంబసభ్యులు.!
Pregnant Woman In Doli
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 21, 2024 | 3:14 PM

Share

ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు, తండాలు అభివృద్ధికి నోచుకోవా? రోడ్డు మార్గం అందని కలేనా? అనారోగ్యం పాలైతే డోలియే మార్గామా? అక్కడి జనం కష్టాలు చూస్తుంటే.. ఇంతేనా అనిపిస్తోంది. ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడిలో నిండు గర్భిణీకి డోలి కష్టాలు ఎదురయ్యాయి. రోడ్డు సదుపాయం సరిగా లేక అంబులెన్స్ రాలేక సన్యాసమ్మ అనే గర్భిణీ నరకయాతన అనుభవించింది. దాదాపు రెండు కిలోమీటర్లు డోలి మోత మోయాల్సి వచ్చింది. పక్కా రోడ్డు నిర్మించాలని విన్నవిస్తున్నారు స్థానిక గిరిజనులు.

డుంబ్రిగుడ మండలం కొల్లాపూట్ పంచాయతీకి చెందిన బొడ్ల మామిడి గ్రామస్తురాలు సన్యాసమ్మకు డెలివరీ సమయం కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే 108కు గ్రామస్తులు ఫోన్ చేశారు. అయితే గ్రామం వరకు రోడ్డు సరిగా లేక.. అంబులెన్స్ రాలేదని డ్రైవర్ చెప్పాడు. దీంతో ఇక చేసేది లేక సన్యాసమ్మకు డోలి కట్టారు. రెండు కిలోమీటర్లు డోలిమోత మోసుకెళ్ళి గ్రామస్తులు అంబులెన్స్ ఎక్కించారు.

రోడ్డు పనులు ప్రారంభించి చాలాకాలం అవుతున్నా పూర్తి కాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేసి మున్ముందు తమకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!