AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తలుపుకు తాళం వేస్తే తప్పదు చోరీ.. రెండేళ్లుగా వీడని మిస్టరీకి పోలీసుల చరమగీతం..

గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‎గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి చోరికి గురైన రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ ,అయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Watch Video: తలుపుకు తాళం వేస్తే తప్పదు చోరీ.. రెండేళ్లుగా వీడని మిస్టరీకి పోలీసుల చరమగీతం..
Mystery Of Serial Thefts
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 21, 2024 | 11:50 AM

Share

గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‎గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి చోరికి గురైన రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ ,అయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా అళ్ళగడ్డ సబ్ డివిజన్‎లో గల కోవెలకుంట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్ళలో ఎనిమిది ఇండ్లలో చోరి జరిగింది. దొంగలు ఎలాంటి క్లూ లేకుండా చోరీలకు పాల్పడటం పోలీసులకు సవాల్‎గా మారింది.

ఈ కేసు ఛాలెంజ్‎గా తీసుకున్న పోలీసులు ఎంతో శ్రమించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించారు. కోవెలకుంట్ల శివారులో వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అరెస్టు అయినవారంతా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులు కేవలం జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దొంగతనాలకు పాల్పడిన దుష్యంత్, ఇజిత్ కుమార్, బత్తుల విజయ్, ఉయ్యాలవాడ గుర్రప్ప, సంజామల శ్రీకాంత్ అంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి చోరీలకు పాల్పడేవాళ్ళు. కేవలం కోవెలకుంట్లలోని ఇళ్లనే టార్గెట్ చేసేవాళ్లుగా తెలుస్తోంది. అందులోనూ తాళం వేసిన వాటిని గమనించి రాత్రి, పగలు అని తేడా లేకుండా పకడ్బందీగా చోరీకి పాల్పడేవాళ్లని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి వెల్లడించారు. కేసు చేదించడంలో ప్రతిభ కనబరిచిన కోవెలకుంట్ల సిఐ జయచంద్ర, ఎస్ఐ వరప్రసాద్, రాజ్ కుమార్‎లను జిల్లా ఎస్పీ రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.

వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం