YS Vivekananda murder case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో తెరపైకి కొత్త వ్యక్తులు.. అసలు కృష్ణయ్య యాదవ్ ఎవరంటే..?
మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో గతంలో కంటే కాస్త దుకుడుగానే సీబీఐ విచారిణ జరుపుతుంది.
మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో గతంలో కంటే కాస్త దుకుడుగానే సీబీఐ విచారణ జరుపుతుంది. కడప, పులివెందుల కేంద్రాలుగా దాదాపు 25 రోజులుగా సీబీఐ బృందం విచారిస్తుంది. మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాలను ఇప్పటికే పలుసార్లు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోగా కొత్తగా ఒక కుటుంబం తెర మీదకు వచ్చింది. పులివెందులకి చెందిన కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్ని మొత్తం సీబీఐ గత కొన్ని రోజులుగా పదే పదే విచారిస్తూ ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు వివేకానంద రెడ్డి హత్య కేస్ లో కృష్ణయ్య యాదవ్ కుటుంబం పాత్ర ఏంటి? అసలు వివేకాకి, కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి పరిచయం ఏంటో తెలుసుకుందాం.
వివేకానంద రెడ్డి హత్య కేస్ లో సీబీఐ ఈసారి కొత్త కోణంలో విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఇదివరకు గతంలో విచారించిన పాత వ్యక్తులనే మళ్లీ మళ్లీ పిలిచి విచారించి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా వివేకా వద్ద డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగి రెడ్డిని విచారించేవారు. ఈసారి వీరితో పాటు పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబంలో సభ్యులందరినీ విచారిస్తున్నారు. వారిని కడప, పులివెందుల కేంద్రాలుగా సాగుతున్న విచారణలో గత 20 రోజులు నుంచి ప్రతి రోజు కృష్ణయ్య యాదవ్ విచారణకి హాజరవుతుంది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ని అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు.
వై ఎస్ వివేకానంద రెడ్డి కేస్ లో పులివెందుల చెందిన ఈ కృష్ణయ్య కుటుంబం మధ్య పరిచయ వివరాలకు వస్తే.. కృష్ణయ్య యాదవ్ కుటుంబం పులివెందుల మండలం మోట్నూంతలపల్లెకి చెందినవారు. కృష్ణయ్య యాదవ్‌కు భార్య సావిత్రి, కుమారులు సునీల్ కుమార్, కిరణ్ కుమార్ ఉన్నారు. వీరు కొన్ని కారణాల రీత్యా పులివెందుల నుంచి అనంతపురం జిల్లా మకాం మార్చారు. అక్కడ కృష్ణయ్య యాదవ్ కుటుంబం బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ లో పూర్తి స్థాయిలో నష్టాలు వచ్చేసరికి అక్కడ ఐపి పెట్టి మళ్ళీ పులివెందుల బాకరపురంకి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చాక ఒక పంచాయితీ వ్యవహారంలో వివేకానందకి ,కృష్ణయ్య కుటుంబానికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరి కుటుంబం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి సన్నిహితంగా మెలిగింది. కొన్ని నెలల తర్వాత కృష్ణయ్య యాదవ్ కొడుకు సునీల్ కుమార్ యాదవ్ కి వివేకానంద రెడ్డికి మధ్య డబ్బుల విషయంతో పాటు ఒక పంచాయితీ వ్యవహారంలో మనస్పర్థలు వచ్చాయి. దీనితో వివేకానంద రెడ్డికి కృష్ణయ్య యాదవ్ కుటుంబం దూరంగా ఉంటుందని సమాచారం. తర్వాత కొన్ని రోజులకే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కావడంతో ఈ కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్నికి ఈ కేస్ లో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సీబీఐ విచారిస్తున్నారు. కృష్ణయ్య యాదవ్ కొడుకు సునీల్ యాదవ్ ని ఢిల్లీలో కూడా విచారించి స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్నారు. ఈ క్రమంలో కృష్ణయ్య కుటుంబానికి వివేకానంద రెడ్డికి ఏ అంశంలో గొడవ జరిగింది, ఎన్ని రోజులు కలిసి పనిచేశారు లాంటి అనేక అంశాలపై సీబీఐ ఆరా తీస్తోంది.
ఏది ఏమైనప్పటికి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకు వస్తున్నారు.. గతంలో కొంతమంది అనుమానితులను ఇచ్చిన సమాచారం తో పాటు కాల్ డేటా ఆధారంగా ఒక్కొక్కరిగా పిలిచి గత 25 రోజుల నుంచి సీబీఐ విచారిస్తుంది. మరి ఈ విడత లోనైనా వివేకా కేసు ఒక కొలిక్కి వస్తుందో లేదో వేచి చూడాలి.
Also Read: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో