Kathi Mahesh: కత్తి మహేష్‌కు చికిత్స నిమిత్తం సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం.. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్...
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. ఈ మేరకు అధికారికంగా సిఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల చెన్నై, నెల్లూరు ప్రధాన రహదారిలో కత్తి మహేష్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే వారం రోజులుగా కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సాయం చేసాడని.. మరోరోజు నెటిజన్లు ఆర్థిక సాయం చేసారని.. కుటుంబ సభ్యులే అంతా పెట్టుకుంటున్నారని.. ఇలా రోజుకో వార్త బయటికి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కేవలం కుటుంబం మాత్రమే మహేష్ కత్తి హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తూ వచ్చినట్లు అతడి మిత్రులు చెప్పారు. ఇన్స్యూరెన్స్ పాలసీలు క్లైమ్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ అధికారికంగా భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన తరువాత కూడా కనీసం 90 రోజుల పాటు కత్తి మహేష్.. తన ఇంటి వద్దే చికిత్సను తీసుకోవాల్సి ఉంటుందంటూ డాక్టర్లు చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుని.. దానికి అయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలను విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం హరికృష్ణ లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మంజూరు చేశారు. దీన్ని చెన్నై థౌజండ్ లైట్స్ గ్రీమ్స్ లేన్‌లోని అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి పంపించారు. కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని అధికారికంగా ఈ లెటర్ ద్వారా తెలియజేశారు. కాగా కత్తి మహేష్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని అపోలో వైద్యులు తెలిపారు.
అధికారిక సమాచారం ఇలా ఉంది..
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి టీవీ9 తెలుగు వాకబు చేసింది. ప్రస్తుతం మహేష్ కోలుకుంటున్నారని.. ఒక కన్నుకి ప్రాబ్లమ్ ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేస్తారని పేర్కొన్నారు. వార్డులో కనీసం రెండు వారాలు ఉండాల్సి ఉంటుందని వివరించారు. డిశ్చార్జ్ తర్వాత కూడా రెండు మూడు మాసాలు రెస్ట్ (కంటి గాయం నుంచి రికవరీ అయ్యేందుకు) అవసరమని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.
Also Read: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో