AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సీబీఐ, ఏసీబీ స్పెషల్ ఆపరేషన్.. ఫారెన్ ట్రేడ్ రీజినల్ ఆఫీసులో మెరుపు దాడులు.. కటకటాల్లోకి ఆ అధికారులు..

Andhra Pradesh: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ( విదేశీ వ్యాపార సంయుక్త కార్యనిర్వహణాధికారి ) విశాఖ కార్యాలయంలో లంచవతారాల భరతం పట్టింది సిబిఐ. విశాఖ సిబిఐ ఏసీబీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ఉన్నతాధికారిని పట్టుకున్నారు. ఇద్దరు అధికారులు సహా ముగ్గురుని అరెస్టు చేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు. లంచం తీసుకున్న ఇద్దరు అధికారులతో పాటు..

Andhra Pradesh: సీబీఐ, ఏసీబీ స్పెషల్ ఆపరేషన్.. ఫారెన్ ట్రేడ్ రీజినల్ ఆఫీసులో మెరుపు దాడులు.. కటకటాల్లోకి ఆ అధికారులు..
Arrest
Maqdood Husain Khaja
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 07, 2023 | 6:15 AM

Share

Andhra Pradesh: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ( విదేశీ వ్యాపార సంయుక్త కార్యనిర్వహణాధికారి ) విశాఖ కార్యాలయంలో లంచవతారాల భరతం పట్టింది సిబిఐ. విశాఖ సిబిఐ ఏసీబీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ఉన్నతాధికారిని పట్టుకున్నారు. ఇద్దరు అధికారులు సహా ముగ్గురుని అరెస్టు చేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు. లంచం తీసుకున్న ఇద్దరు అధికారులతో పాటు.. లంచంతో పనులు చేయించుకోవాలని చూసిన ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ను కూడా కటకటాల వెనక్కు నెట్టారు. ఏకంగా జాయింట్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇప్పుడు కలకలం రేపుతుంది.

విశాఖలో లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికిపోయాడు కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారి. నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ ఫారెన్ ట్రేడ్ రీజనల్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ జనరల్ బి.ఎన్ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు. రమేష్ తో పాటు జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వైజాగ్ రీజినల్ ఆఫీసులో సెక్షన్ హెడ్ శ్రీభాష్యం వెంకట రంగనాథన్ అరెస్ట్ ను అరెస్టు చేశారు విశాఖ సిబిఐ ఏసీబీ వింగ్ అధికారులు. జాయింట్ డైరెక్టర్ జనరల్ తీసుకున్న నాలుగు లక్షల లంచం కు అదనంగా… మరో 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు వెంకట రంగనాథన్. అయితే ఈ కేసులో.. అధికారులకు లంచం ఇచ్చిన కీర్తి ఇండన్టింగ్ ఎగ్జిమ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీతారామరాజు ను కూడా చేర్చారు. లైసెన్సులతో పాటు ఎగుమతి, దిగుమతి పత్రాలు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారు అధికారులు. జాయింట్ డైరెక్టర్ 4 లక్షల లంచం, సెక్షన్ హెడ్ మరో 50,000 లంచం డిమాండ్ చేశారు. లంచం మొత్తాన్ని కార్యాలయానికి తీసుకెళ్లి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సిబిఐ కి సమాచారం అందింది. పక్క సమాచారంతో దీంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు.. సీతారామరాజు నుంచి లంచం తీసుకున్న.. ఫారెన్ ట్రేడ్ జాయింట్ డైరెక్టర్ జనరల్ రమేష్, జెడి కార్యాలయం సెక్షన్ హెడ్ వెంకటరంగనాథన్ ను రెడ్ హ్యాండెడ్ గా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. వాళ్లతో పాటు లంచం ఇచ్చిన సీతారామరాజు పైన కేసు పెట్టారు.

వైజాగ్ హైదరాబాద్ బెంగళూరులో సోదాలు..

ఇద్దరు అధికారులు సహా ముగ్గురు పట్టుబడిన తర్వాత.. విశాఖ సహా హైదరాబాద్ బెంగళూరులోనూ నిందితుల కార్యాలయం, ఇళ్లల్లో సోదలు చేశారు సిబిఐ అధికారులు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరిచారు అధికారులు. ముగ్గురుని ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్టు. సిబిఐ న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు.

ఒక కేంద్ర ప్రభుత్వానికి చెందిన రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో సిబిఐ అధికారులు అత్యంత చకచకంగా వ్యవహరించారు. చాలా కేసుల్లో ఫిర్యాదు వస్తే నిందితులను ఎరవేసి పట్టుకుంటారు. కానీ ఈ కేసులో.. అధికారులు లంచం తీసుకుంటున్నారని వచ్చిన సమాచారాన్ని.. డెవలప్ చేసి.. లంచం ఇస్తున్న వ్యక్తికి కూడా కనీసం అనుమానం రాకుండా.. లంచం ఇస్తున్న సమయంలో మాట వేసి.. రెడ్ హ్యాండెడ్ గా ముగ్గురుని పట్టుకోవడం తో అవినీతిపరుల గుండెల్లో గుబులు పుడుతొంది. ఇంకా ఈ కేసులో దర్యాప్తు ఉందని ప్రకటించారు సిబిఐ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..