Andhra Pradesh: వివాహితను దక్కించుకునేందుకు ఆమె భర్తకు స్పాట్ పెట్టిన ప్రియుడు.. షాకింగ్ వివరాలు వెల్లడించిన పోలీసులు..
అన్నమయ్య జిల్లా పీలేరులో ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసు సంచలనం రేకెత్తించింది. ప్రధాన నిందితుడు కిషోర్ అరెస్ట్‌తో సైనేడ్ దాడి వ్యవహారం వెలుగు చూసింది. పీలేరులో మొట్టమొదటి సారిగా సైనేడ్ హత్యకు ఉపయోగించినట్లు తేలడంతో చర్చగా మారింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన కిషోర్ గతంలో వాలంటీర్ గా పనిచేసేవాడు. పీలేరు ఇందిరమ్మ కాలనీలో కాపురం ఉంటున్న ఆటో డ్రైవర్ సుధాకర్ భార్య అశ్వినితో కిషోర్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

అన్నమయ్య జిల్లా పీలేరులో ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసు సంచలనం రేకెత్తించింది. ప్రధాన నిందితుడు కిషోర్ అరెస్ట్‌తో సైనేడ్ దాడి వ్యవహారం వెలుగు చూసింది. పీలేరులో మొట్టమొదటి సారిగా సైనేడ్ హత్యకు ఉపయోగించినట్లు తేలడంతో చర్చగా మారింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన కిషోర్ గతంలో వాలంటీర్ గా పనిచేసేవాడు. పీలేరు ఇందిరమ్మ కాలనీలో కాపురం ఉంటున్న ఆటో డ్రైవర్ సుధాకర్ భార్య అశ్వినితో కిషోర్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అశ్వినిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్ చేసిన కిషోర్ ఆమె భర్త ఆటో డ్రైవర్ సుధాకర్ ను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఈ మేరకు గత నెల 31 న డేట్ ఫిక్స్ చేసుకున్న కిషోర్ ఈ మేరకు మరో ముగ్గురు స్నేహితుల సహకారంతో ప్లాన్ అమలు చేశాడు. తిరుపతికి చెందిన చందు ప్రసాద్ సునీల్ అనే స్నేహితులతో కలిసి సుధాకర్ హత్యకు ప్లాన్ చేసిన కిషోర్ ఆగస్టు 31 న ఆటోలో కొటపల్లి వద్ద కూతుర్ని స్కూల్ కి తీసుకెళ్లి వదిలి తిరిగి వస్తుండగా సుధాకర్ పక్క ప్లాన్ తో సైనెడ్ ఇంజక్షన్‌తో దాడి చేసి హత్య చేయాలనుకున్నాడు.
ఈ మేరకు కిషోర్ మరో ముగ్గురు స్నేహితులు అనుకున్న ప్రకారం ప్రయాణికుల్లా ఆటోలో స్కూల్ వద్ద కూతురిని వదిలి తిరిగి ఆటోలో వస్తున్న సుధాకర్ ని ఆపి ఆటోలో ఎక్కిన ముగ్గురు ప్లాన్ అమలు చేశారు. వెనుక వైపు నుంచి సుధాకర్ మెడపై సైనేడ్ ఇంజక్షన్ గుచ్చి హత మార్చాలని చూశారు కిషోర్ స్నేహితులు. ఇంజక్షన్ వెంటనే సుధాకర్ కాసేపటికి అక్కడే అనుమానాస్పద మృతిలో మృత్యువాత పడ్డాడు. ఈ మేరకు భార్య అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి రోడ్డులో ఆయిల్ సీడ్స్ ఫ్యాక్టరీ వద్ద కిషోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లు నిర్ధారించారు. ప్రియురాలు అశ్విని కోసం ఆమె భర్త సుధాకర్ ను హత్య చేసేందుకు సైనేడ్ దాడికి పాల్పడిన నిందితుడు కిషోర్ అంగీకరించినట్లు తేల్చారు. ఆటో డ్రైవర్ సుధాకర్ భార్య అశ్వినితో కిషోర్ కు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమన్నారు.
అశ్వినిని దక్కించుకునేందుకు ఆమె భర్త సుధాకర్‌ను పథకం ప్రకారం అంత మొందించాలని ప్లాన్ చేసిన కిషోర్ ముగ్గురు స్నేహితుల సహకారంతో హత్య చేశాడని, సైనేడ్ ప్లాన్ సక్సెస్ కాకపోతే కత్తులతో నరికి చంపాలని కూడా ప్లాన్ చేసినట్లు కిషోర్ అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. పీలేరులో సంచలనం రేకెత్తించిన సుధాకర్ సైనేడ్ మర్డర్ కేసు ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోనే చర్చగా మారిపోగా ప్రధాన నిందితుడు కిషోర్‌ను అదుపులో తీసుకున్న పోలీసులు హత్య కేసులో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..