బరితెగించిన బ్యాంకు ఉద్యోగి.. లోన్ల కోసం వస్తే ఖాతాదారుల డబ్బులు స్వాహా

ప్రజలకు నమ్మకంతో సేవలు చేసేవే బ్యాంకులు. వినియోగదారుల నగదు భద్రపరుచుకునేందుకు.. లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఎంతో మేలు చేస్తాయి.

బరితెగించిన బ్యాంకు ఉద్యోగి..  లోన్ల కోసం వస్తే ఖాతాదారుల డబ్బులు స్వాహా
ఇక కెనరా బ్యాంక్ వివిధ మొత్తాల మీద 2.90 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రూ.2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద గరిష్టంగా 4 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
Follow us

|

Updated on: Mar 20, 2023 | 3:56 PM

ప్రజలకు నమ్మకంతో సేవలు చేసేవే బ్యాంకులు. వినియోగదారుల నగదు భద్రపరుచుకునేందుకు.. లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఎంతో మేలు చేస్తాయి. కాని అందులో పని చేసే ఉద్యోగులు ఏవైన తప్పులు చేస్తే ఆ బ్యాంకులకే చెడ్డ పేరు వస్తుంది. అయితే తాజాగా నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కెనరా బ్యాంక్ లో పని చేసే భాస్కర్ అనే ఉద్యోగి చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. సాధారణంగా బ్యాంకులకు రుణాల కోసం జనాలు వస్తూనే ఉంటారు. దీన్నే ఆసరాగా చేసుకున్న ఆ ఉద్యోగి తన వక్రబుద్దిని బయటపెట్టాడు. ఖాతాదారులకు బంగారు నగలపై ఇచ్చే రుణాల్లో అవకతవకలకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే దాదాపు 130 మంది ఖాతాదారులు ఆ బ్యాంకు నుంచి బంగారు నగలపై రుణాలు తీసుకున్నారు. అయితే భాస్కర్ వారిక తక్కువ డబ్బులు అందజేసి మిగతా సొమ్మును అక్రమంగా దోచుకున్నాడు. ఖాతాదారులకు తమ డబ్బులపై అనుమానం రావడంతో బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో భాస్కర్ ఆ డబ్బులను స్వాహా చేసినట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు భారీగా చేరుకున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించి భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే గతంలోను భాస్కర్ కొంతమంది ఖాతాదారులతో కుమ్మక్కై నకిలీ బంగారంతోను రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..