JR NTR: తారకరాముడి వైపు కమలం చూపు.. పొలిటికల్ సర్కిల్స్‌లో నయా టాక్

తాజాగా కర్నాటక సీఎం ఇంటికి పిలిచి ఎన్టీఆర్‌ను సత్కరించారు. గతంలో హైదాబాద్ వచ్చిన అమిత్‌షాతో తారకరాముడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

JR NTR: తారకరాముడి వైపు కమలం చూపు.. పొలిటికల్ సర్కిల్స్‌లో నయా టాక్
Amit Shah - Jr.ntr
Follow us

|

Updated on: Nov 02, 2022 | 1:13 PM

యంగ్‌టైగర్ చూపు బీజేపీ వైపు…! సినిమా ప్లస్ రాజకీయ రంగాల్ని మళ్లీ హీటెక్కిస్తున్న టాపిక్ ఇది. నాటోన్లీ ఏపీ… దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ. మంగళవారం బెంగళూరుకెళ్లి… కర్నాటక రాజ్యోత్సవ వేడుకల్లో రెడ్‌కార్పెట్‌ వెల్‌కమ్ తీసుకున్న ఎన్టీయార్… ఆ వెంటనే… సీఎం బస్వరాజ్ బొమ్మై ఇంటికెళ్లి ప్రత్యేకంగా సత్కారం అందుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి సాదరంగా స్వాగతం పలికి, శాలువ, పూలమాలతో సత్కరించారు సీఎం బస్వరాజ్. ఈ పరిణామం… పొలిటికల్‌గా కొత్త చర్చకు ఛాన్సిచ్చేసింది. జస్ట్ ఏ ఫార్మల్ మీటింగ్.. నో పాలిటిక్స్ ప్లీజ్ అని పైకి చెబుతున్నా… లోలోపల మాత్రం ఏదో జరుగుతోంది అనే సందేహాలు పుడుతూనే ఉన్నాయి. దీంతో అటు ఫ్యాన్స్‌, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో… కమలనాథుల కన్ను ఎన్టీయార్‌పై పడిందా… పార్టీలోకి అహ్వానిస్తున్నారా అనే గుసగుస అన్ని మీడియాల్లోనూ గుప్పుమంటోంది.

ఇటీవల హైదరాబాద్‌కొచ్చిన హోమ్‌మంత్రి అమిత్‌షా… ఎన్టీయార్‌ని ప్రత్యేకంగా హోటల్‌కి పిలిపించుకుని భేటీ అయ్యారు. తారక్‌ని జెమ్ ఆఫ్ తెలుగు సినిమా అని సంబోధిస్తూ స్పెషల్‌గా ట్వీట్ చేశారు. ఇప్పుడు కర్నాటకలో కొలువున్న బీజేపీ సర్కార్ కూడా… ఎన్టీయార్‌కి ఎర్రతివాచీ పరవడాన్ని ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు. పార్టీని దక్షిణాదిలో మరింత బలోపేతం చేసే దిశగా సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది బీజేపీ. అందుకే… ఇలా సినిమా ఫ్లేవర్ల మీద డిపెండ్ అవుతోందా… స్టారాధిస్టార్లను మచ్చిక చేసుకుంటోందా? అని కామెంట్లు పడుతున్నాయి.

గతంలో తారక్ పొలిటికల్ ఇంటెన్షన్స్‌ మీద డౌట్లు వ్యక్తమైనప్పుడు… తన వైఖరేంటో ఓపెన్‌గా చెప్పేశారు ఎన్టీయారు. కట్టే కాలే వరకూ నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటా అంటూ ఆమధ్యనోసారి శపథం చేశారు. పదేళ్ల కిందటి ఈ స్టేట్‌మెంట్ తర్వాత ఎన్నోసార్లు ఎన్టీయార్ రాజకీయాలపై కామెంట్లు, కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. రిసెంట్‌గా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసి వైఎస్‌ఆర్ పేరు పెట్టినప్పుడు జూనియర్ ఇచ్చిన రియాక్షన్ కూడా కాంట్రవర్సియల్ అయింది. ఎన్టీయార్‌, వైఎస్‌ఆర్ ఇద్దరూ మహామహులే అంటూ.. ఒకే గాటన కట్టడాన్ని చాలామంది విమర్శించారు. ఎన్టీయార్‌ని వైఎస్‌ఆర్‌తో పోలిక పెడతావా అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి ట్రోలింగ్ జరిగింది.

ఈ నేపథ్యంలో… ఎన్టీయార్‌ రిపీటెడ్‌గా బీజేపీ శిబిరాల్లో కనిపిస్తుండడం సహజంగానే హాట్‌టాపిక్ అవుతోంది. టాలీవుడ్ మీద స్పెషల్‌గా ఫోకస్ పెట్టిన కమలనాథులు… ప్రభాస్‌ మేనియాను కూడా క్యాప్చర్ చేశారు. ఇటు ఎన్టీయార్‌ని సైతం వదిలేదే అనే కమిట్‌మెంట్ కనిపిస్తోంది. మరి… తారకరాముడు ఏమంటారు..? తన పొలిటికల్ ఫ్యూచర్‌పై కొత్తగా ఏదైనా క్లారిటీ ఇస్తారా? అని వెయిట్ చేస్తున్నారు యంగ్‌టైగర్ అభిమానులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!