నంద్యాల జిల్లాలో బీహార్ దొంగలు.. సినిమా స్టైల్లో హైవేపై చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..
ముందుగా.. బీహార్ దొంగల ముఠా సమాచారం హర్యానా పోలీసులకు అందడంతో వెంబడించారు. అయితే.. ఇది గమనించిన దొంగలు.. తమ స్విఫ్ట్ కార్, ట్రక్కును ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళించి కర్నూలు దాటి పోయారు. దాంతో.. నంద్యాల జిల్లా డోన్ పోలీసులకు హర్యానా పోలీసులు సమాచారం ఇచ్చారు. నంద్యాల జిల్లాలో బీహార్ దొంగల ముఠాను సినిమా స్టైల్లో హైవేపై చేజ్ చేసి మరీ పట్టుకున్నారు డోన్ పోలీసులు. ఇంతకీ.. బీహార్ గ్యాంగ్‌ను పోలీసులు ఎందుకు చేజ్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చదవండి..
నంద్యాల జిల్లా, సెప్టెంబర్ 24: హర్యానా నుండి తెలంగాణ, ఏపీ వైపు వస్తున్న బీహార్ ఏటీఎం దొంగల ముఠా పనిబట్టారు నంద్యాల జిల్లా డోన్ పోలీసులు. అయితే.. దొంగల గ్యాంగ్‌ను పట్టుకోవడానికి హర్యానా.. ఏపీ పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. ముందుగా.. బీహార్ దొంగల ముఠా సమాచారం హర్యానా పోలీసులకు అందడంతో వెంబడించారు. అయితే.. ఇది గమనించిన దొంగలు.. తమ స్విఫ్ట్ కార్, ట్రక్కును ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళించి కర్నూలు దాటి పోయారు. దాంతో.. నంద్యాల జిల్లా డోన్ పోలీసులకు హర్యానా పోలీసులు సమాచారం ఇచ్చారు.
అదేసమయంలో.. స్థానిక పోలీసు ఉన్నతాధికారులు కూడా డోన్ పోలీసులను అలర్ట్ చేశారు. అంతే.. హుటాహుటిన డోన్ పోలీసులు.. 44వ జాతీయ రహదారిపై వాహనాలు అడ్డుపెట్టి బీహార్ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దొంగలు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కార్‌తోపాటు.. భారీ ట్రక్కును కూడా సీజ్ చేశారు. వాటిలోని చోరీలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, మారణాయుధాలను డోన్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకుని దొంగలను డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీహార్ దొంగలను అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో డోన్ పట్టణంతోపాటు కర్నూలు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన చోరీలతో బీహార్ దొంగల ముఠాకు సంబంధం ఉందా అని ఆరా తీశారు.
ఇక.. పట్టుబడిన దొంగలను బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నంద్యాల, కర్నూల్ పోలీసు ఉన్నతాధికారులు డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని నిందితుల నుంచి చోరీల సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో.. రెక్కీ నిర్వహించాకే ఏపీలోని పలు ఏటీఎంలలో చోరీలు చేసేందుకు వచ్చినట్లుగా బీహార్ దొంగల ముఠా వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం