200 ఏళ్ళనాటి భవనం.. నేటికీ చెక్కుచెదరని కట్టడం.. కట్టింది ఎవరో తెలుసా..
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం చేసిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. ఈ గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో కూడా బ్రిటిష్ వారి కట్టడాలు చాలానే ఉన్నాయి. అటువంటి కట్టడాలలో ఒకటైన గిద్దలూరు తహసిల్దార్ కార్యాలయం నేటికీ చెక్కుచెదరకుండా నిలిచే ఉంది. అందులో నియోజకవర్గంలోనే మొదట నిర్మించిన తహసిల్దార్ కార్యాలయంగా ఈ కార్యాలయం రికార్డు నెలకొల్పింది.
ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 24: దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఉన్నాయి.. కొన్ని చరిత్రలో కలిసిపోగా మరి కొన్ని చెక్కుచెదరకుండా ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. అటువంటి కట్టడాలలో బ్రిటిష్ వారి కట్టడాలు కూడా ఉన్నాయి… అలాంటి కట్టడాల్లో ఒకటి ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉంది.. 200 ఏళ్ళకు పైగా రెవెన్యూ సేవలందించిన ఆనాటి రెవెన్యూ భవనం విశేషాలు తెలుసుకుందాం.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం భిన్నమైన వాతావరణానికి పెట్టింది పేరు. ఆటు కర్నూలు జిల్లా నంద్యాల కు ఇటు కడప జిల్లాకు దగ్గరగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం చేసిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. ఈ గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో కూడా బ్రిటిష్ వారి కట్టడాలు చాలానే ఉన్నాయి. అటువంటి కట్టడాలలో ఒకటైన గిద్దలూరు తహసిల్దార్ కార్యాలయం నేటికీ చెక్కుచెదరకుండా నిలిచే ఉంది. అందులో నియోజకవర్గంలోనే మొదట నిర్మించిన తహసిల్దార్ కార్యాలయంగా ఈ కార్యాలయం రికార్డు నెలకొల్పింది.
ఈ తాసిల్దార్ కార్యాలయం బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు. 1908 వ సంవత్సరంలో ఇక్కడ తాసిల్దార్ కార్యాలయాన్ని బ్రిటిష్ వారు నిర్మించారు. దాదాపు 200 సంవత్సరాలకు పైగా ఈ కార్యాలయాన్ని అధికారులు వినియోగించారు. నేటికీ ఈ కార్యాలయం చెక్కుచెదరకుండా అలాగే నిలిచి ఉంది… పెంకులతో ఈ తాసిల్దార్ కార్యాలయాన్ని సుందరంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. అంతేకాకుండా ఈ భవనానికి సంబంధించిన గోడలు, టేకు కలపతో తయారు చేసిన నిర్మాణాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.. వేసవికాలంలో కూడా ఈ భవనం ఎంతో చల్లగా ఉంటుంది… ఇటీవల నూతనంగా తహసిల్దార్ భవనాన్ని నిర్మించారు.
ప్రస్తుతం గిద్దలూరు తహసిల్దార్ విభాగం పరిపాలన నూతన భవనం నుంచి జరుగుతోంది. చరిత్రకెక్కిన ఎన్నో కట్టడాలు ఉన్నా గిద్దలూరు లో ఉన్న తాసిల్దార్ భవనం నూతన చరిత్ర సృష్టించింది… 200 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనాన్ని నేటికీ చాలామంది ప్రత్యేకంగా సందర్శిస్తుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్క క్లిక్ చేయండి