Big News Big Debate: పోలవరానికి పోటెత్తిన పొలిటికల్ వరద.. అటు సీఎం.. ఇటు మాజీ సీఎం..
Big News Big Debate: పోలవరానికి పొలిటికల్ వరద పోటెత్తింది. రెండ్రోజులుగా నాయకుల పరస్పర విమర్శలతో వాతావరణం గరంగరంగా మారింది. ఒకరికి డ్యామ్ ఎత్తు ప్రాబ్లమ్ అయితే.. ఇంకొకరికి నిర్వాసితుల సమస్యే ప్రధానమైపోయింది. మరొకరు డయాఫ్రమ్ వాల్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ పోలవరంలో పూర్తయిందెంత? కట్టాల్సింది ఇంకెంత?
Big News Big Debate: పోలవరం పాలిటిక్స్ గరం గరంగా నడుస్తున్నాయి ఏపీలో. వర్షాలు పడినప్పుడల్లా ఏపీలో పోలవరం పొలిటికల్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే సాగుతోంది. మొన్న కురిసిన వర్షాలకు పోలవరం ఎగువన.. దిగువన చాలా గ్రామాలు మునిగిపోయాయి. ముంపు మండలాలు పది రోజులపాటు ఇబ్బందులకు గురయ్యాయి. లంక గ్రామాలు ఇప్పటికీ తేరుకోలేదు. ముంపు గ్రామాల్లో రీహాబిలిటేషన్ మందకొడిగా సాగుతోంది. రెండు రోజులుగా గోదావరి గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్.. చంద్రబాబు చేసిన పనివల్లే ప్రాజెక్టు లేటువుతోందన్నారు. Rఅండ్R తన చేతిలో లేదని.. సవరించిన లెక్కలను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే వేగంగా పనులు జరగుతాయన్నారు సీఎం జగన్..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా కొన్నిరోజులుగా ప్రజెంటేషన్లతో తన పాయింట్‌ను నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో నాలుగు శాతం పనులు కూడా చేయలేదన్నారు. కేంద్రం నిధులిస్తున్నా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
పోలవరం లేటు కాడానికి కారణం గత టీడీపీ.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలే కారణమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఆమె పోలవరంపై కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే పోలవరం వేగంగా పూర్తవుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 41.15 అడుగుల ఎత్తువరకు ఎంత ఖర్చవుతుందో అంత రిలీజ్ చేస్తామంటోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆతర్వాత పూర్తి ప్రాజెక్టుకు నిధులు సమకూరతాయంటున్నారు. ప్రాజెక్టులో మేజర్ నిర్మాణాలు తామే చేపట్టామన్నారు.
ప్రస్తుతం పోలవరం పొలిటికల్ ముంపులో చిక్కుకుంది. ప్రాజెక్టు పూర్తయితే కాని.. రాజకీయం చల్లబడేలా లేదు.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..