Andhra Pradesh: రాయి తంత్రం ఎవరిది..? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో హీటెక్కుతున్న రాజకీయం!

ఇప్పటికే రాయి వెనక మిస్టరీతో సలసల కాగుతున్న ఏపీ రాజకీయాల్లో... మరోసారి కులం ముచ్చట తెరమీదకు వచ్చింది. వంగావీటి మోహన రంగా స్మరణ మళ్లీ మొదలైంది. ఆయన వారసత్వంపై మరోసారి పొలిటికల్‌ రచ్చకు నాంది పడింది. ప్రజాగళం సభలో తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్సే దీనికి ప్రధాన కారణమైంది.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2024 | 9:28 PM

ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన రాయిదాడి… రాజకీయంగా పెనుదుమారం రేపుతూనే ఉంది. నిందితుడు దొరికాడు.. అయినా బెజవాడ కేంద్రంగా ఈ అంశం, పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. ఈ దాడివెనుక ఎవరున్నారనే అంశంలో.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాయి వెనక మిస్టరీతో సలసల కాగుతున్న ఏపీ రాజకీయాల్లో… మరోసారి కులం ముచ్చట తెరమీదకు వచ్చింది. వంగావీటి మోహన రంగా స్మరణ మళ్లీ మొదలైంది. ఆయన వారసత్వంపై మరోసారి పొలిటికల్‌ రచ్చకు నాంది పడింది. ప్రజాగళం సభలో తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్సే దీనికి ప్రధాన కారణమైంది. మాజీ మంత్రి పేర్నిని టార్గెట్‌ చేస్తూ… పవన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మేం మేం కాపులం అంటూ.. బూతులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌. ఏ కులంవాళ్లను ఆ కులంవాళ్లతో తిట్టిస్తారంటూ వైసీపీ హైకమాండ్‌ను కూడా పవన్‌ టార్గెట్‌ చేయడం.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. పవన్‌ వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ నేతలు. పవన్‌ తీరును ప్రశ్నిస్తే తిట్టినట్టేనా అని రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు.

చంద్రబాబును పక్కన పెట్టుకుని తిరిగే పవన్‌కు… రంగా పేరెత్తే అర్హత లేదన్నారు మంత్రి జోగి రమేష్‌. రంగాకు నిజమైన వారసులం తామేనని స్పష్టం చేశారు. గొడ్డళ్లలో రంగాను చంపించింది చంద్రబాబేనని… హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు జోగి రమేష్‌. అలాంటి చంద్రబాబుతో తిరుగుతూ.. కాపులను పవన్‌ ఎలా ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..