Andhra Pradesh: మొన్న జగన్‌పై.. నిన్న పవన్‌పై.. రాయి వెనక రాజకీయం..! ఏపీలో ఎటాకింగ్ కల్చర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల అధినేతలే టార్గెట్‌గా జరుగుతున్న దాడులు.. కలకలం సృష్టిస్తున్నాయి. జగన్‌పై దాడి ఘటనను మరువక ముందే జనసేన అధినేత పవన్‌పై కూడా అలాంటి ప్రయత్నమే జరగడం పొలిటికల్‌గా దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించి.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడిని ఖండిస్తూనే.. పొలిటికల్ డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు.. వైసీపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్‌కు కారణమవుతున్నాయి.

సీఎంపై రాయి విసరడం ముమ్మాటికీ తప్పేనంటున్న టీడీపీ నేతలు.. ఆ ఘటనను రాజకీయం చేయడం సరికాదంటున్నారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలకు అంటగట్టడం కరెక్టు కాదన్న గోరంట్ల బుచ్చయ్య… దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే డీజీపీ, సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, సీఎం జగన్‌పై దాడి కేసులో.. దోషులెవరో విచారణలో తెలుస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే డ్రామాలనడం సరికాదన్న సజ్జల… జగన్‌కు అంత అవసరం లేదన్నారు. నింద తమమీదకు వస్తోందన్న భయం టీడీపీలో కనబడుతోందన్నారు సజ్జల.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో..
ఇప్పటికే వరుస దాడులపై.. ఈసీ దగ్గరకు ఫిర్యాదులతో పరుగులు పెడుతున్నాయి పార్టీలు. మరి దర్యాప్తులో ఏం తెలుతుందన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. కాకపోతే, రాళ్లు-రప్పల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం ఎన్నికలనాటికి ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందన్నదే ఆసక్తి రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..