Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైల్వే స్టేషన్‎లో తేనెటీగల దాడి.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం అంటే కిడ్నీ రోగుల సమస్యలతో పాటు వన్య ప్రాణులు గుర్తుకు వస్తూ ఉంటాయి. కోతులు, ఎలుగుబంట్లు ఎప్పటికప్పుడు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. పంట పొలాలు, తోటల్లో తిష్ట వేస్తూ రైతుల పంటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జనావాసలపై కూడా పడుతూ ఎదురు పడితే మనుషులపై దాడులకు సైతం దిగుతున్నాయి ఎలుగుబంట్లు.

Watch Video: రైల్వే స్టేషన్‎లో తేనెటీగల దాడి.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..
Bees In Mandasa Road Railwa
Follow us
S Srinivasa Rao

| Edited By: Srikar T

Updated on: Mar 22, 2024 | 9:16 AM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం అంటే కిడ్నీ రోగుల సమస్యలతో పాటు వన్య ప్రాణులు గుర్తుకు వస్తూ ఉంటాయి. కోతులు, ఎలుగుబంట్లు ఎప్పటికప్పుడు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. పంట పొలాలు, తోటల్లో తిష్ట వేస్తూ రైతుల పంటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జనావాసలపై కూడా పడుతూ ఎదురు పడితే మనుషులపై దాడులకు సైతం దిగుతున్నాయి ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లు, కోతులతోనే ఉద్దానం ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతూ ఉంటే తాజాగా ఇప్పుడు వాటికి తోడు తేనె తీగలు మేము సైతం అంటున్నాయి. అయితే ఇవి ఇటీవల రైల్వే ప్రయాణికులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి.

మందస రోడ్ రైల్వే స్టేషన్‎లో తేనె తీగల దాడి..

ఉద్ధానం ప్రాంతంలోని మందస రోడ్ రైల్వే స్టేషన్‎లో ఇటీవల తరచూ తేనెటీగలు చెలరేగిపోతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భువనేశ్వర్, విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‎ప్రెస్ రైలు కోసం మందస రోడ్ రైల్వేస్టేషన్‎లో ప్రయాణికులు నిరీక్షిస్తుండగా ఒక్కసారిగా తేనె టీగలు విరుచుకుపడ్డాయి. గుంపుగా వచ్చి ఫ్లాట్ ఫామ్‎పై ఉన్న ప్రయాణికులపై దాడి చేశాయి. అయితే ఊహించని ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు అంతా చెరో దిక్కు పరుగులు పెట్టారు. కొందరైతే గోనె సంచులు ఒంటిపై కప్పుకొని వాటి దాడి నుండి రక్షించుకునేందుకు యత్నించారు. మొత్తానికి తేనెటీగల దాడిలో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు.

ట్రైన్ మిస్సయిన ప్రయాణికులు..

సరిగ్గా భువనేశ్వర్ టు విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‎ప్రెస్ రైలు వచ్చే సమయానికే తేనె తీగలు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాయి. దాంతో అంతవరకు ట్రైన్ కోసం ఫ్లాట్ ఫామ్‎పై నిరీక్షించిన ప్రయాణికులంతా తమను తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. అదే సమయంలో ట్రైన్ రావటంతో ట్రైన్‎ను అందులోలేకపోయారు. దీంతో టికెట్ తీసుకొని మరీ ట్రైన్ ఎక్కలేకపోయామని ఆవేదన చెందారు. అయితే ఈ రైల్వే స్టేషన్లో మూడు రోజుల కిందట కూడా తేనెటీగలు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాయి. అప్పుడు ఇలాగే పరుగులు పెట్టారు ప్రయాణికులు. అప్పుడు పది మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే మూడు రోజుల వ్యవధిలో రెండవసారి తేనెటీగలు దాడి చేయటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మళ్ళీ ఎప్పుడు దాడి చేస్తాయా అన్నట్లు రైల్వే స్టేషన్‎లోని మూడు పెద్ద చెట్లపై 12 పెద్ద తేనె పుట్టలు కనిపిస్తుండటంతో ప్రయాణికులు ఇప్పుడు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చెట్లపై తిష్ట వేసిన తేనెటీగలను రైల్వే అధికారులు తొలగించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..