Drugs: విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం.. సీపోర్ట్‌లో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం
ఒకటా..రెండా.. ఏకంగా 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఆపరేషన్ గరుడలో భాగంగా రంగంలోకి దిగిన సీబీఐ భారీగా డగ్స్ సీజ్ చేసింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన కంటైయినర్‌ను ఎవరు పంపారు? ఎవరికి పంపారు? డెలివరీ అడ్రస్ ఉన్న కంపెనీ ఎవరిది? టోటల్ సీన్ సీక్రెట్స్‌పై ఆరా తీస్తోంది సీబీఐ.

ఒకటా..రెండా.. ఏకంగా 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఆపరేషన్ గరుడలో భాగంగా రంగంలోకి దిగిన సీబీఐ భారీగా డగ్స్ సీజ్ చేసింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన కంటైయినర్‌ను ఎవరు పంపారు? ఎవరికి పంపారు? డెలివరీ అడ్రస్ ఉన్న కంపెనీ ఎవరిది? టోటల్ సీన్ సీక్రెట్స్‌పై ఆరా తీస్తోంది సీబీఐ. అయితే ఇంతలోనే ఓనర్లు బయటికు వచ్చి ఆ కన్‌సైన్మెంట్ తమదేనని చెప్పడం ఇందులో ట్విస్టు. విశాఖ సాగరతీరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగి వీటిని స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్‌ను సీబీఐ అండ్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీ వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
డ్రగ్స్ కంటెయినర్‌ను బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టులో బుక్ చేశారు. విశాఖలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ జరిగింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి ఈ కన్‌సైన్‌మెంట్ అందుకోవాల్సి ఉంది. ఇంటర్‌పోల్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డులో సీబీఐ దాడులు నిర్వహించింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీపేరుతో డెలివరీ అడ్రస్ ఉండటంతో దాని ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. RVLN గిరిధర్, కృష్ణమాచార్య శ్రీకాంత్, K భరత్‌కుమార్ పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది సీబీఐ. ఇప్పటికే రెండు సార్లు సీబీఐ అధికారులు ఆ మెటీరియల్‌కు టెస్టులు నిర్వహించారు. దానిలో సరైన ఫలితాలు రాలేదు. దీంతో ఇందులో కొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ టెస్టుకు పంపారు. వారం పది రోజుల్లో టెస్టు రిజల్స్ వస్తాయి. తామైతే ఫీడ్ ప్లాంట్ కోసం ఈస్ట్‌ను తెప్పించామంటున్నారు సంధ్యా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ నిర్వాహకులు. బ్రెజీల్‌లో దొరికే ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందంటే అక్కడి నుంచి తెప్పించామంటున్నారు.
తమ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని. తాము ఎలాంటి తప్పుచేయలేదని.. తమకు ఏ పార్టీకి కూడా సంబంధంలేదంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఇంటర్ పోల్ అందించిన సమాచారంతో సీబీఐ.. ఇలాంటి ఆపరేషన్లను తరచూ నిర్వహిస్తోంది. ఇందులో ఉన్నది నిజంగానే కొకైనా.. లేక కంపెనీ బుక్ చేసిన రా మెటీరియలా అనేది త్వరలోనే బయటపడనుంది. ఈ వివాదాన్ని పొలిటికల్‌గా కొన్ని పార్టీలు ఎవరికి తోచినట్లు వారు వాడుకుంటున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.