Watch Video: మూడేళ్లకు ఒక్కసారే పెళ్లి ముహూర్తాలు.. వరుడికి తాళి కడుతున్న వధువు.. ఎక్కడో తెలుసా..

ఊరంతా పందిరి. ఇంటింటా పెళ్లి బాజాలు. మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు. ఒకే రోజు, ఒకే ముహూర్తానికి ఏకమైన 62 జంటలు. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం ఎక్కడా ఉండేదే. కానీ ఇక్కడ మాత్రం ముందు అబ్బాయి.. అమ్మాయి మెడలో తాళి కడితే.. తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి మెడలో తాళి కడుతుంది. ఈ వింతలు విశేషాలు ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామం నువ్వులరేవు గ్రామంలోనిది. అబ్బో ఇలా చెబుతూ పోతే ఆ గ్రామంలో పెళ్లిల్లకు ఎన్నో ప్రత్యేకతలు.

Watch Video: మూడేళ్లకు ఒక్కసారే పెళ్లి ముహూర్తాలు.. వరుడికి తాళి కడుతున్న వధువు.. ఎక్కడో తెలుసా..
Ancient Traditionmarriage
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 22, 2024 | 9:19 AM

ఊరంతా పందిరి. ఇంటింటా పెళ్లి బాజాలు. మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు. ఒకే రోజు, ఒకే ముహూర్తానికి ఏకమైన 62 జంటలు. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం ఎక్కడా ఉండేదే. కానీ ఇక్కడ మాత్రం ముందు అబ్బాయి.. అమ్మాయి మెడలో తాళి కడితే.. తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి మెడలో తాళి కడుతుంది. ఈ వింతలు విశేషాలు ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామం నువ్వులరేవు గ్రామంలోనిది. అబ్బో ఇలా చెబుతూ పోతే ఆ గ్రామంలో పెళ్లిల్లకు ఎన్నో ప్రత్యేకతలు.

గ్రామంలో మూడేళ్లకు ఒకసారి సామూహిక వివాహాలు..

సాధారణంగా గ్రామంలో ఒక పెళ్లి జరిగితేనే ఆ సందడి ఊహించలేం.. అలాంటిది గ్రామంలో ఒకేసారి 62 పెళ్ళిళ్ళు జరిగితే ఆ సందడి ఊహకే అందదు కదా. నువ్వుల రేవు గ్రామంలో సామూహిక వివాహాలు ఓ ప్రత్యేకం. తరాలు మారుతున్నా.. దశాబ్దాలు దాటుతున్నా.. ఇప్పటికా సామూహిక వివాహాలు ఆ గ్రామంలో ఆచారంగా కొనసాగుతూ వస్తున్నాయి. రోజులు గడుసున్నకొద్దీ.. క్యాలెండర్లు మారుతున్న కొద్దీ.. సంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్న నేటి రోజులలో కూడా నువ్వల రేవు గ్రామస్తులు తమ ఆచార వ్యవహారాలను మాత్రం తూచాతప్పకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. సామూహిక వివాహాలను సంప్రదాయoగా నిర్వహిస్తూ వస్తున్నారు గ్రామస్తులు. మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఈ గ్రామములో పెళ్లిడుకు వచ్చిన యువతి యువకులకు వివాహం జరిపిస్తారు. ఊరంతా పందిళ్లు వేసి.. వీధుల్లో.. విద్యుత్ వెలుగులు పచ్చని మామిడి తోరణాలను కట్టి.. ఒకే ముహూర్తంలో.. ఎంతో వైభవంగా కొత్త జంటలు ఒక్కటవుతుంటాయి. ఈ ఏడాడి ఈనెల 17న పెద్దలు కుదిర్చిన ముహూర్తంలో 62 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి అంటే స్నేహితులు, బంధువులు, ఊరందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయాలి. అదంతా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో అప్పట్లో పెళ్లి ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా మూడేళ్లకు ఒకసారి సామూహిక వివాహాలను జరిపించడం ఆనవాయితీగా పెట్టారట గ్రామ పెద్దలు.

గ్రామంలోని అబ్బాయిలతోనే గ్రామంలోని అమ్మాయిలకు వివాహాలు..

నువ్వలరేవు గ్రామంలో.. సుమారు 3500కు పైగా కుటుంబాలున్నాయి. 13వేల జనాభా ఉంటుంది. శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు.. నువ్వలరేపు కేంద్రంగా నివాసం ఏర్పరచుకొని స్థిరపడ్డారు. అప్పటి నుంచే ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత వచ్చింది. ఊరు ఊరంతా.. ఒకే మాట మీద ఉంటారు. గ్రామ పెద్ద ఏది చెబితే.. అంతా దానినే ఫాలో అవుతారు. ఈ ఊళ్లో.. బెహరా, బైనపల్లి, మువ్వల ఇంటి పేరుతో ఎక్కువ కుటుంబాలుంటాయి. ఇక్కడ.. కేవిటీ సామాజికవర్గానికి పెద్దగా వాళ్లు ఏది చెబితే.. అదే వేదం. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారా వ్యవహారాల నుంచి.. రాజకీయాల దాకా అందరిదీ ఒకే మాట. ఒకే బాట. ముఖ్యంగా.. పెళ్లిళ్ల విషయంలో పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు నువ్వలరేవు గ్రామస్తులు. మూడేళ్లకు ఒకసారి కుదిర్చిన ముహూర్తంలోనే.. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులు ఒక్కటవుతుంటారు. ఈ గ్రామనికి చెందిన అమ్మాయిలకు.. అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో.. వివాహాలు జరిపించడం ఆనవాయితీ. ఇతర ప్రాంతాల్లోని అమ్మాయిలను, అబ్బాయిలను.. ఈ గ్రామ యువతీ, యువకులతో వివాహాలు జరిపించరు. ఇదంతా.. ఇంటి పెద్దల అంగీకారం, అమ్మాయి, అబ్బాయిల ఇస్టానుసారమే పెళ్లిళ్లు నిర్ణయిస్తుంటారు. గతంలో ఈ ఊరి అమ్మాయిలను బయట గ్రామాల అబ్బాయిలకి ఇచ్చి వివాహం జరిపించారట కానీ అలా బయటకు వెళ్లిన అమ్మాయి చనిపోవటం, పెళ్లిల్లు పెటాకులవ్వటం వంటివి జరగటంతో ఆ తర్వాత నుండి అబ్బాయికి, అమ్మాయికి గ్రామంలోని వారితోనే వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఒకే ముహూర్తంలో.. అన్ని జంటలకు సామూహిక మాంగల్యధారణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కేవిటీ సంప్రదాయం ప్రకారం.. రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ కోనేరు నుంచి తెచ్చిన నీటితో పెండ్లి కుమారుడు మంగళ స్నానాలు ఆచరించి ఇంటి ముందు వెళ్లి పీటలపై కూర్చుంటాడు. తర్వాత వధూవరులు ఆకు చెక్కలతో.. ఇంటింటికి వెళ్లి.. బంధువులు, స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు.

ఇవి కూడా చదవండి

వధూవరులు ఇరువురు ఒకరి మెడలో ఒకరు తాళి కట్టడం ఇక్కడ సంప్రదాయం..

ఇక్కడ పెళ్లికొడుకు ప్రత్యేకంగా ముస్తాబవుతారు. అత్తారింటికివచ్చిన నల్ల కళ్ళద్దాలు, బట్టలు ధరించి.. స్నేహితులు, బంధువులు ఇచ్చిన కరెన్సీ నోట్లను దండగా మెడలో వేసుకొని.. పెళ్లి పీటలపై కూర్చుంటాడు పెళ్లి కొడుకు. అంతేకాదు.. హిందూ వివాహ పద్ధతిలో.. వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. తర్వాత.. వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది. కాకపోతే దీనిని.. దురుసం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఒకరి మెడలో ఒకరు తాలి కట్టడం వల్ల సంసార జీవితంలో ఇద్దరు సమాన భాగస్వాములుగా సమాన బాధ్యతలుతో ముందుకు వెళతామని చెప్పటం. పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి కట్టిన తాళిని18 రోజులు తర్వాత తీసి తన శతమానంలో కట్టుకుంటుంది పెండ్లి కుమార్తె. మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ సామూహిక వివాహాల కోసం.. చిన్నా, పెద్దా అంతా కలిసి వస్తారు. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలసెళ్లిన వాళ్లంతా.. గ్రామానికి చేరుకొని.. గ్రామంలో మూడేళ్లకు ఒకేసారి జరిగే ఈ పెళ్లిళ్లలో పాల్గొంటారు. ఈ ఏడాది గ్రామంలో 62 సామూహిక పెళ్ళిళ్ళు జరిగాయి. దీంతో దాదాపుగా ప్రతి ఇంటి ముందు పెళ్లి వేదిక బాజా బజంత్రీలతో సందడి నెలకొంది. ఒకే రోజు, ఒకే ముహూర్తంలో జరిగే 62 పెళ్లిళ్లకు 62 మంది పురోహితులను వెతకటం గ్రామ పురోహితుడికి పెద్ద పననే చెప్పాలి. మొత్తానికి కొన్ని దశాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు.. కొత్త తరాలు కూడా సై అంటున్నాయి. ఎన్ని జనరేషన్స్ మారినా.. తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడం ఆనందంగా ఉంటుందని.. గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సామూహిక వివాహాల సంప్రదాయాన్ని.. ఇక ముందు కుడా కొనసాగిస్తామని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..