Pawan Kalyan: ఈనెల 27న జనసేనపార్టీ ఎన్నికల శంఖారావం .. రాష్ట్ర రోడ్లపైకి మరోసారి వారాహి వాహనం
ఆంధ్రప్రదేశ్ రోడ్లపై మరోసారి వారాహి దూసుకెళ్లనుంది. మార్చి 27న పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరోవైపు పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నారు మనోహర్, నాగబాబు.. ఇంకోవైపు ప్రచారంలోకి దుసుకుపోతోంది జనసేన.
ఆంధ్రప్రదేశ్ రోడ్లపై మరోసారి వారాహి దూసుకెళ్లనుంది. మార్చి 27న పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరోవైపు పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నారు మనోహర్, నాగబాబు.. ఇంకోవైపు ప్రచారంలోకి దుసుకుపోతోంది జనసేన.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మార్చి 27నుంచి ప్రచారంలో జోరు పెంచబోతున్నారు. ఓవైపు చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే, మరోవైపు వారాహి వాహనంతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. పవన్ ప్రచారం కోసం వారాహి వాహనాన్ని ఇప్పటికే రెడీ చేశారు ఆపార్టీ నేతలు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున వారాహి వాహనంపై ఈనెల 27నుంచి జిల్లాల ప్రచారానికి సిద్ధమవుతున్నారు పవన్.
ముందుగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి 27న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు జనసేన అధినేత పవన్. జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో వారాహివాహనంతో పవన్ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 10 ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవైపు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే, మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు.
జనసేన పార్టీలో అసంతృప్తులపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పలు నియోజకవర్గాల్లో సీటు విషయంలో ఆందోళన చేస్తున్న నేతలను మంగళగిరి పిలిపించి వన్‌టూవన్ మాట్లాడుతున్నారు పవన్. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో నిరసన తెలుపుతున్న పోతిన మహేష్‌తో పవన్ భేటీ అయ్యారు. వెస్ట్ సీటు విషయంలో పొత్తు పార్టీలతో చర్చలు జరుపుతున్నాం.. 100 పర్సెంట్ న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు పోతిన మహేష్.
తిరుపతి ఇన్‌ఛార్జ్ ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై నెలకొన్న పేచీపై ఆరా తీస్తున్నారు పవన్. ఆరణి విషయంలో పార్టీ సొంత కేడర్‌తోపాటు తెలుగుదేశం నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పునరాలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. వివాదం సర్ధుమణిచేందుకు తిరుపతి జనసేన కేడర్‌ని పార్టీ అధిష్టానం మంగళగిరి పార్టీ ఆఫీసుకి పిలిపించి మాట్లాడింది. తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తో పాటు 25 మందితో నాగబాబు భేటీ అయ్యారు. తిరుపతి కేడర్ అభిప్రాయాన్ని తెలుసుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నాగబాబు.
అలాగే అమలాపురం, పి.గన్నవరం, భీమిలి నేతలతోను నాగబాబు మంగళగిరి ఆఫీసులో సమావేమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ కేటాయించాలని ఆందోళన చేస్తున్న నేతల అభిప్రాయన్ని తెలుసుకొని.. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు నాగబాబు. మరోవైపు రామచంద్రాపురం నేతలు నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. రామచంద్రాపురం సీటు జనసేనకు కేటాయించాలని పట్టుబడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…