AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gomatha Seemantham: గోమాతకు శ్రీమంతం చేసిన రైతు.. వేద మంత్రాల నడుమ గోమాతకు అర్చనలు

ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుకు ఓ కుటుంబం అత్యంత ఘనంగా సీమంత వేడుకలను నిర్వహించింది. 

Gomatha Seemantham: గోమాతకు శ్రీమంతం చేసిన రైతు.. వేద మంత్రాల నడుమ గోమాతకు అర్చనలు
Govuku Seemantam
Surya Kala
|

Updated on: Jan 24, 2023 | 1:24 PM

Share

స్త్రీ మరో జీవికి ప్రాణం పోసే ముందు క్షేమాన్ని కాంక్షిస్తూ హిందూ సంస్కృతిలో జరిపే ముఖ్య ఘట్టం సీమంతం. తల్లి, పుట్టబోయే శిశివు క్షేమాన్ని దీర్ఘాయుస్సుని కోరుతూ జరిపించే సాంప్రదాయ వేడుక. సర్వసాధారంగా గర్భవతికి ఆరవనెల గాని, ఎనిమిదవ నెలలో గానీ సీమంతం జరుపుతుంటారు. సాధారణంగా మహిళలకు సీమంతం జరపడం ఆనవాయితీ అయితే గత కొంతకాలంగా తమ పెంపుడు జంతువులు గర్భం దాలిస్తే సీమంతం జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోమాతకు కూడా సీమంతం జరుపుతున్నారు అనేకమంది. ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుకు ఓ కుటుంబం అత్యంత ఘనంగా సీమంత వేడుకలను నిర్వహించింది.

మచిలీపట్నం చింతగుంట పాలెంలో గోవుకు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు శ్రీమంత వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తన గోభక్తి చాటుకున్నారు. బంధు మిత్రులు ముఖ్య అతిధులుగా హాజరుకాగా.. వేద పండితుల సమక్షంలో ఈ గోమాత సీమంతం కార్యక్రమం వేడుకగా సాగింది. అందంగా అలంకరించిన గోవులను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించి వాటికి సీమంతం నిర్వహించారు. గోమాతకు పసుపు, కుంకుమలు రాసి.. కొత్త వస్త్రాలు సమర్పించుకున్నారు. గో ప్రదక్షిణలు చేశారు.  ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..