Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 14 షరతులతో పోలీసుల అనుమతి.. అవేంటంటే..
నారా లోకేష్ పాదయాత్రపై సస్పెన్స్ వీడింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు.బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లోకేష్ యువగళం పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు పోలీసులు. బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని.. భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలన్నారు. ఇదిలా ఉంటే పోలీసుల అనుమతిపై తెలుగు దేశం నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పోలీసులు విధించిన ఆంక్షలు పాదయాత్రలో పాటించలేమని ఇలాంటి షరతులతో కూడిన అనుమతి తమకు వద్దని కొందరు టీడీపీ నేతలు అన్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్రకు టీడీపీ దరఖాస్తు చేసుకున్న విషయం, నిబంధనలకు లోబడి ఎలాంటి షరతులతో అనుమతి ఇచ్చామనే దానిపై పోలీస్ అధికారులు ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు.
పాదయాత్ర షెడ్యూల్ ఇలా..
ఈ నెల 27న కుప్పం నుంచి నడక ప్రారంభించనున్నారు నారా లోకేష్. ఈ పాదయాత్ర కార్యక్రమం షెడ్యూల్ ఇలా సాగబోతోంది. ఈ నెల 25న లోకేష్ హైదరాబాద్‌లో తన నివాసం నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ చేరుకుంటారు. అక్కడే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కడపకు వెళతారు.. అక్కడ పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం మరియాపురంలోని కేథలిక్ చర్చిని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం