Konaseema: డబ్బుతో దొరికిన బ్యాగును స్టేషన్‌లో అప్పగించిన మహిళ.. సన్మానించిన పోలీసులు

అమలాపురం నుంచి తన గ్రామానికి ఆటోలో వెళ్తుండగా బ్యాగ్‌ జారిపోయింది. అయితే మహిళ అది గమనించకుండా వెళ్లిపోయారు. ఆటో దిగే క్రమంలో బ్యాగ్‌ కోసం చూడగా బ్యాగ్‌ కనిపించలేదు. దాంతో కంగారుపడిన మృదుల వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

Konaseema: డబ్బుతో దొరికిన బ్యాగును స్టేషన్‌లో అప్పగించిన మహిళ.. సన్మానించిన పోలీసులు
Konaseema
Follow us
Surya Kala

|

Updated on: Jan 24, 2023 | 2:28 PM

ఓ సాధారణ మహిళ తన నిజాయితీని చాటుకుంది. క్యాష్‌తో రోడ్డుపై దొరికిన బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. మహిళ నిజాయితీకి మెచ్చుకొని పోలీసు అధికారులు ఆమెను ప్రశంసించారు.. ఆమెను సన్మానించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల అంబాజీపేట మండలంలోని మాచవరం గ్రామం కోటివారి అగ్రహారానికి చెందిన మృదుల కుమారి అనే గృహిణి ఆటోలో వెళ్తూ తన బ్యాగ్‌ పోగొట్టుకున్నారు. అమలాపురం నుంచి తన గ్రామానికి ఆటోలో వెళ్తుండగా బ్యాగ్‌ జారిపోయింది. అయితే మహిళ అది గమనించకుండా వెళ్లిపోయారు. ఆటో దిగే క్రమంలో బ్యాగ్‌ కోసం చూడగా బ్యాగ్‌ కనిపించలేదు. దాంతో కంగారుపడిన మృదుల వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అమలాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బ్యాగు పోగొట్టుకున్నట్టు, అందులో లక్షా 42 వేల రూపాయలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదులో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఈ క్రమంలో అమలాపురం రూరల్‌ మండలం బండారు లంకకు చెందిన తనూజ అనే మహిళ తనకు రోడ్డుమీద ఓ బ్యాగ్‌ దొరికిందంటూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింది. దాంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. అంతేకాదు మహిళ నిజాయితీకి ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె నిజాయితీకి మెచ్చుకున్న రూరల్‌ సీఐ వీరబాబు, అమలాపురం తాలూకా ఎస్సై పరదేశి ఆమెను పూలదండతో సత్కరించారు. డబ్బు పోగొట్టుకున్న మహిళకు ఆ బ్యాగును అప్పగించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!