TDP: ‘రాజకీయాలకు డబ్బే ప్రధానం అయిపోయింది’.. తొలిజాబితాపై అసంతృప్తిలో టీడీపీ నేత..
ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. దీనిపై ఇరుపార్టీల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అవనిగడ్డ అభ్యర్థి పేరును ప్రకటించనందుకు అక్కడి టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భావనను వ్యక్తం చేశారు.

ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. దీనిపై ఇరుపార్టీల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అవనిగడ్డ అభ్యర్థి పేరును ప్రకటించనందుకు అక్కడి టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భావనను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల వివరాలతో మొదటి జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు చంద్రబాబు. అందులో టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అవనిగడ్డ సీటును ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది టీడీపీ. దీంతో అక్కడి టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. తనకు టిక్కెట్ ప్రకటించకపోవడం పట్ల ఆనందంగా ఉన్నానంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షిలా ఉన్నానన్నారు బుద్ధ ప్రసాద్. ప్రస్తుతం రాజకీయాలకు డబ్బే ప్రధానం అయిపోయిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పదవులను అడ్డుపెట్టుకుని ఎప్పుడూ దోచుకోలేదని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. తన ప్రస్తుత పరిస్థితిని కార్యకర్తలు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై తనలోని అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారు బుద్ధ ప్రసాద్. ‘నా ఆలోచనలు, నేను నమ్మిన సిద్దాంతాలు మీకు తెలుసు. పదవులకోసం పుట్టలేదు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి మన ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదు.రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమై పోయింది. ఓటరుని కొనుగోలు వస్తువుగా రాజకీయపక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతులకోసం అన్వేషిస్తున్న తరుణంలో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదు. పరిస్దితులను కార్యకర్తలు, ప్రజలు అర్దం చేసుకోండి. దయచేసి వేరేవిధంగా ఆలోచించవద్దు.’ అంటూ ఎక్స్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




