AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu – Bhuvaneshwari: కుప్పం నాదే.. భువనేశ్వరి వ్యాఖ్యల తర్వాత పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన..

సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికార పార్టీ వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు అన్ని స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కూటమి కూడా మరో ముందడుగు వేసింది. ఏపీలో టీడీపీ, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది.

Chandrababu - Bhuvaneshwari: కుప్పం నాదే.. భువనేశ్వరి వ్యాఖ్యల తర్వాత పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన..
Chandrababu Bhuvaneshwari
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 27, 2024 | 10:50 AM

Share

సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికార పార్టీ వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు అన్ని స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కూటమి కూడా మరో ముందడుగు వేసింది. ఏపీలో టీడీపీ, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయబోతోంది. ఈ క్రమంలో.. 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కుప్పంలో నారా భువనేశ్వరినా.. లేక చంద్రబాబు నాయుడా.. పోటీ చేసేది ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. కుప్పం నుంచి తానే పోటీ చేయనున్నట్లు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించుకున్నారు. దీంతో కుప్పం బరిలో ఉండేదెవరో.. తేలిపోయింది. దీనంతటికి ప్రధాన కారణం.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు బదులు తాను కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పర్యటించిన భువనేశ్వరి.. తనకు మనసులో ఒక కోరిక కలిగిందని.. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి ఈసారి కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.

దీంతో కుప్పం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. నారా భువనేశ్వరి కుప్పంలో పోటీచేస్తే.. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఏ నియోజవర్గం అయితే బాగుంటుంది.. అనే ఊహగానాలు మొదలయ్యాయి.. ఈ క్రమంలోనే వాటన్నింటికి చెక్ పెడుతూ.. చంద్రబాబు తానే పోటీచేస్తున్నట్లు చెప్పడంతో.. కుప్పం అభ్యర్థి ఎవరన్నది క్లారిటీ వచ్చింది.

అయితే, మూడున్నర దశాబ్దాల నుంచి కుప్పం నియోజవర్గం చంద్రబాబు ఇలాఖాగా ఉంది.. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. 1989 నుంచి ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తూ.. టీడీపీ జెండా ఎగురవేస్తున్నారు. అక్కడ ఆయన ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు.

టీడీపీ అభ్యర్థుల జాబితా..!!!!!

ఆముదావలస – కూన రవికుమార్ ఇచ్ఛాపురం – బెందాలం అశోక్ టెక్కలి – అచ్చెన్నాయుడు రాజాం – కొండ్రు మురళీమోహన్ అరకు – దొన్ను దొర సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి అనకాపల్లి – పీలా గోవింద్ నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ వెస్ట్ – గణ బాబు కొత్తపేట – బండారు సత్యానందరావు మండపేట – జోగేశ్వర రావు జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ పెద్దాపురం – చిన రాజప్ప తుని – యనమల దివ్య అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్ పాలకొల్లు – నిమ్మల రామానాయుడు ఆచంట – పితాని సత్యనారాయణ తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ ఉండి – మంతెన రామరాజు చింతలపూడి – సొంగా రోషన్ దెందులూరు – చింతమనేని ప్రభాకర్ ఏలూరు – బడేటి రాధాకృష్ణ గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ – వెనిగండ్ల రాము మచిలీపట్నం – కొల్లు రవీంద్ర పెడన – కాగిత కృష్ణ ప్రసాద్ జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్ నందిగామ – తంగిరాల సౌమ్య విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్ మంగళగిరి – నారా లోకేష్ పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్తిపాడు – బి.రామాంజనేయులు తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్ చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ రేపల్లె – అనగాని సత్యప్రసాద్ వేమూరు – నక్కా ఆనంద్ బాబు అద్దంకి – గొట్టిపాటి రవికుమార్ పర్చూరు – ఏలూరి సాంబశివ రావు కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కొండెపి – డోలా బాల వీరాంజనేయులు ఒంగోలు – దామచర్ల జనార్దన్ ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి గూడూరు – పాశం సునీల్ కుప్పం – నారా చంద్రబాబు నాయుడు నగరి – గాలి భాను ప్రకాష్ పలమనేరు – అమర్నాథ రెడ్డి హిందూపురం – బాలకృష్ణ తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి రాప్తాడు – పరిటాల సునీత ఉరవకొండ – పయ్యావుల కేశవ్ కడప – రెడ్డప్పగారి మాధవి పులివెందుల – బీటెక్ రవి మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్ కర్నూలు – టీజీ భరత్ నంద్యాల – NMD ఫరూక్ పాణ్యం – గౌరు చరితా రెడ్డి పత్తికొండ – కేఈ శ్యాం ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..