AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటో నడుపుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన డ్రైవర్.. అసలు కారణం ఇదే..

ప్రతి రోజూ రాత్రి 9 గంటలకల్లా ఇంటికి వచ్చే కుటుంబ యజమాని రాకపోవడంతో ఇంటిల్లిపాది ఆందోళనకు గురయ్యారు. తెల్లారిన తర్వాత.. ఇంటికి కిలోమీటరు దూరంలోనే విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. చూపరులను సైతం కంటతడి పెట్టించిన ఈ ఘటన విజయవాడలోని బాంబే కాలనీలో చోటు చేసుకుంది.వాంబేకాలనీ సి బ్లాక్‎లో కదిరి అప్పన్న స్థానికంగా నివసిస్తున్నారు. ఆయన ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అప్పన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం చేశారు.

అటో నడుపుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన డ్రైవర్.. అసలు కారణం ఇదే..
Vijayawada
M Sivakumar
| Edited By: |

Updated on: Feb 23, 2024 | 5:10 PM

Share

ప్రతి రోజూ రాత్రి 9 గంటలకల్లా ఇంటికి వచ్చే కుటుంబ యజమాని రాకపోవడంతో ఇంటిల్లిపాది ఆందోళనకు గురయ్యారు. తెల్లారిన తర్వాత.. ఇంటికి కిలోమీటరు దూరంలోనే విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. చూపరులను సైతం కంటతడి పెట్టించిన ఈ ఘటన విజయవాడలోని బాంబే కాలనీలో చోటు చేసుకుంది.వాంబేకాలనీ సి బ్లాక్‎లో కదిరి అప్పన్న స్థానికంగా నివసిస్తున్నారు. ఆయన ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అప్పన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం చేశారు. ప్రతి రోజూ ఆటో కిరాయికు వెళ్లి, రాత్రి 9 గంటల కల్లా ఇంటికీ వచ్చేవారు. బుధవారం రాత్రి 11 గంటలైనా రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆయనకి ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం ఉదయం వాంబేకాలనీ రోడ్డులోని ఓపెన్ డ్రెయిన్లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లారు కుటుంబ సభ్యులు. చనిపోయింది తన భర్తే అని గుర్తించిన భార్య కాంతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరంకాలేదు.

కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి స్నేహితులు తరలివచ్చారు. దీంతో పోలీసులు సమాచారం అందుకొని సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. కాలువలోకి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రథమికంగా భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ , పాయకాపురం ప్రధాన రహదరుల్లో ఓపెన్ డ్రెయిన్లు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. జనం ప్రాణాలు తీసేస్తున్నాయి. వాంబే కాలనీకి వెళ్లే మార్గంలో ప్రధాన డ్రెయిన్లో పడి కదిరి అప్పన్న అనే ఆటోడ్రైవర్ బుధవారం రాత్రి మరణించారు. ఇదే డ్రెయిన్లో వారం రోజుల క్రితం ఓ వృద్ధుడు మరణించారు. నూజివీడు ప్రధాన రహదారిలోనూ ఇదే పరిస్థితే నెలకొంది. రాత్రి వేళ భయం భయం.. రోడ్డు అంచుకు సమాంతరంగా ఓపెన్ డ్రెయిన్లు నిర్మించారు. నూజివీడు రహదారిలో.. పాయకాపురం చెట్టు సెంటరులోనూ ఇదే పరి స్థితి. ఏ వాహనమైనా అదుపు తప్పి రోడ్డు అంచుకు వెళితే.. సరాసరి మురుగు కాలువలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఈ ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎవరైనా మద్యం తాగి.. ఆ మత్తులో వాహనాలు నడుపుతూ డ్రెయిన్లో పడితే.. వారిని కాపాడడం కష్టమే. ఎవరూ చూడకపోతే ప్రాణాలు దక్కవు. పొర పాటున కాలు జారి పడినా.. ఆరు అడుగుల లోతున్న డ్రెయిన్లలో మునిగిపోతారు. పడే సమయంలో తలకు దెబ్బ తగిలి అపస్మారక స్థితి చేరుతారు. మురుగు నీటిలో మునికి చనిపోక తప్పదు.

ప్రాణాలు పోతున్నా.. అధికారుల చర్యలు మాత్రం శూన్యం. ఓపెన్ డ్రెయిన్లపై సిమెంటు దిమ్మెలు వేయాలని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా తరచూ డ్రెయిన్లలో పడి జనం చనిపోతూనే ఉన్నారు. వన్లైన్లో ఓపెన్ డ్రెయిన్లలో అభంశుభం తెలియని చిన్న పిల్లలు పడి మరణించినా అధికారుల్లో చలనం ఉండటం లేదని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నగర వ్యాప్తంగా సర్వే చేసి ప్రమాదకరంగా ఉన్న ఓపెన్ డ్రెయిన్లపై సిమెంటు దిమ్మెలు వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగరపాలక వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి.. మృతుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోతైన ట్రైన్ల వద్ద రక్షణ చర్యలు లేవని సిమెంటు దిమ్మలు వేయాలని తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా డ్రైనేజీలో పడి పలువురు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే