Andhra Pradesh: “అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అర్థమేంటో జగన్ రెడ్డికి తెలుసా”.. అచ్చెన్నాయుడు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడు రాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన పాద యాత్ర – 2 హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ప్రభుత్వం మూడు రాజధానులను సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలని, అది కూడా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధ్యఅక్షుడు అచ్చెన్నాయుడు […]

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడు రాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన పాద యాత్ర – 2 హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ప్రభుత్వం మూడు రాజధానులను సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలని, అది కూడా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధ్యఅక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. విశాఖలో భూఅక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా అని ప్రశ్నించారు. మూడు రాజధానులతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆక్షేపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అర్థమేంటో జగన్ రెడ్డికి తెలుసా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. సీఎం జగన్.. అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి అంశాలపై మంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగా రైతులు పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వానికి భయమెందుకు. గడపగడపలో ఎదురవుతున్న చీపుర్ల సత్కారాలే మూడేళ్ల పాలనకు నిదర్శనం. విశాఖలో భూఅక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా. అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా అన్నీ అబద్ధాలే చెబుతున్నారు.
– అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు




కాగా.. మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న ‘విశాఖ గర్జన’ ర్యాలీ చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైజాగ్ లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. విశాఖపట్నం ను పాలన రాజధానిగా చేస్తే వస్తే నష్టమేంటని బొత్స ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల మనోభావాలను అనుగుణంగా పని చేయాల్సి ఉందని చెప్పారు. విశాఖ గర్జన ర్యాలీలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని స్పష్టం చేశారు.