Uppada: ఉప్పాడలో భారీ పేలుడు.. బోట్ రిపేర్ షెడ్ లో ఘటన.. ఒకరికి తీవ్ర గాయాలు..

కాకినాడ జిల్లా ఉప్పాడలో భారీ పేలుడు సంభవించింది. బోటు రిపేర్ షెడ్డులో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో భారీ పేలుడు సంభవించింది. ఉప్పాడ..

Uppada: ఉప్పాడలో భారీ పేలుడు.. బోట్ రిపేర్ షెడ్ లో ఘటన.. ఒకరికి తీవ్ర గాయాలు..
Blast
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 13, 2022 | 6:38 AM

కాకినాడ జిల్లా ఉప్పాడలో భారీ పేలుడు సంభవించింది. బోటు రిపేర్ షెడ్డులో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో భారీ పేలుడు సంభవించింది. ఉప్పాడ సముద్ర తీరం సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అమీనాబాద్ పెట్రోల్ బంక్ సమీపంలో గల బోటు రిపేర్ చేసే షెడ్ లో పెద్ద శబ్ధం వినపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలువ పక్కనే బోట్లు నిలిపి రిపేర్ చేసుకునే షెడ్ వద్ద రోడ్డు పక్కన తుప్పలు తొలగించి దారి ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బోటు రిపేర్ షెడ్ ఓనర్ బడే ఏసుదాసు అనే వ్యక్తి గునపంతో గొయ్యి తీస్తుండగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ఏసుదాసు చెయ్యి తెగి పడింది. ఒకపక్క చెయ్యి.. మరోపక్క గునపం తునాతునకలైంది. రక్తపు మడుగులో పడి అల్లాడిపోతున్న ఏసుదాసును స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ పైప్ లీకైందా? లేక ఏదైనా పేలుడు పదార్థమా అనే కోణంలో క్లూస్ టీమ్‌తో కలిసి విచారణ చేస్తున్నారు. బోటు రిపేర్ షెడ్డులో ఒక్కసారిగా భారీ పేలుడు రావటంతో స్ధానికులు బాంబు పేలుడుగా దీన్ని భావిస్తున్నారు. అయితే పేలుడుకు కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మత్సకారులతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకోవడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా.. గతంలోనూ కాకినాడ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు జరిగింది. మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. మృతులను సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌లుగా గుర్తించారు. ఆ ఘటనను మరవకముందే మరోసారి ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!