AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

తిరుమల లో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళుల పవిత్ర మాసం పెరటాసి కావడం, తెలుగు వారు పవిత్రంగా భావించే కార్తీక మాసం దగ్గర పడుతుండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా...

Tirupati: తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Trains
Ganesh Mudavath
|

Updated on: Oct 13, 2022 | 7:06 AM

Share

తిరుమల లో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళుల పవిత్ర మాసం పెరటాసి కావడం, తెలుగు వారు పవిత్రంగా భావించే కార్తీక మాసం దగ్గర పడుతుండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా సెప్టెంబర్ చివర్లో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనలేని భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇప్పుడు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుగిరులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అప్పుడప్పుడు ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. ప్రస్తుతానికి కూడా తిరుపతికి రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించింది. శుక్రవారం సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరనున్న ప్రత్యేక రైలు 07485 నంబర్ గల రైలు.. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది.

శనివారం తిరుపతి నుంచి రాత్రి 7.50 గంటలకు బయల్దేరనున్న రైలు 07486 నంబర్ గల రైలు ఆదివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో CH.రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రైల్వేలు.. ఆదాయంలోనూ దూసుకుపోతున్నాయి. నిత్యం లక్షల కొద్దీ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే భారతీయ రైల్వే ఆదాయ సముపార్జనలోనూ పురోగతి సాధిస్తోంది. గడిచిన ఆరు నెలల కాలంలో రూ.33 వేల కోట్లకు పైగా రైల్వేకు ఆదాయం పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 వరకు రైల్వేలకు దాదాపు రూ.33,476 కోట్లు ఆదాయం సమకూరినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో ప్యాసింజర్‌ రెవెన్యూ రూ.17,394 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రెట్టింపుకు పెరగడం గమనార్హం.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి