Andhra Pradesh: అనుమానస్పదంగా కనిపించిన కార్లు.. పోలీసులు చెక్ చేయగా షాకింగ్ దృశ్యం.
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా గంజాయి దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గంజాయి తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. ఇక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు కూడా..
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా గంజాయి దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గంజాయి తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. ఇక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు కూడా అక్రమాలకు దిగుతుండడం కొసమెరుపు. తాజాగా ఓ రైల్వే పోలీస్ గంజాయి తరిలస్తూ పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అ్లలూరి జిల్లాలో చోటు చేసుకుంది.
అరకులోని ఎన్టీఆర్ పార్కు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటుగా వచ్చిన రెండు కార్లను అడ్డుకున్నారు. వ్యవహారం కాస్త అనుమానంగా ఉండడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో పోలీసులకు ఊహించని దృశ్యం కనిపించింది. రెండు కార్లలో ఏకంగా 202 కిలోల గంజాయి కనిపించింది. యూపీలో ఆర్పీఎస్ ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేంద్ర కుమార్ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. రెండు కార్లను సీజ్ చేసిన పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు.
నిందితుల్లో నరేంద్ర కుమార్‌తో పాటు యూపీకి చెందిన బౌన్సర్ రాహుల్ సింగ్, ఒడిస్సాకు చెందిన అనంతరాంగా గుర్తించారు. ఒడిస్సా పాడువా నుంచి యూపీకి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.. పరారైన మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..