Fake Baba: చికిత్సపేరుతో యువతుల్ని మోసం చేస్తున్న ఫేక్ బాబా.. 18 ఏళ్ల యువతితో 8 పెళ్ళికి రెడీ.. చివరికి..

 ఓవైపు 5G టెక్నాలజీతో.. మరోవైపు అదునాతన వైద్యంతో ప్రపంచం దూసుకుపోతున్నా.. జనాలు మాత్రం ఫేక్ బాబాల ట్రాప్ లో పడుతూనే ఉన్నారు. తాజాగా వైద్యం పేరుతో బురిడీ ఓ యువతిని బురిడీ కొట్టించాడు. నిత్యపెళ్లిళ్లతో మోసం చేస్తున్న ఫేక్ బాబా గుట్టు రట్టైంది.

Fake Baba: చికిత్సపేరుతో యువతుల్ని మోసం చేస్తున్న ఫేక్ బాబా.. 18 ఏళ్ల యువతితో 8 పెళ్ళికి రెడీ.. చివరికి..
Hafeez Pasha
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2023 | 7:35 AM

మోస పోయేవాళ్లు ఉన్నంతకాలం.. మోసం చేసేవారు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆధునిక యుగంలోనూ  మూఢ నమ్మకాలతో మోసపోతున్నారు ప్రజలు. మాయగాళ్ల, మంత్రగాళ్ల ట్రాప్‌ లో పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. నమ్మకాన్ని అదునుగా చేసుకొని మాయ మాటలతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు ఫేక్‌ బాబాలు. తాజాగా నెల్లూరు రెహ్మత్‌దర్గాకు చెందిన ఓ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ట్రీట్‌మెంట్‌ పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడంటూ ఓ యువతి కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు.

మానసిక వ్యాధితో బాధపడుతున్న హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన యువతి.. ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో దర్గా, బాబా దగ్గరకు వెళ్తే నయమవుతుందని కొందరూ చెప్పిన మాటలతో హైదరాబాద్, కడప దర్గాలను సందర్శించారు యువతి పేరెంట్స్. చివరగా నెల్లూరు రెహ్మతాబాద్‌ దర్గాకు చెందిన హఫీజ్‌ పాషా దగ్గర.. ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ప్రతి 30 రోజులకు 45 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి నెల్లూరు దర్గాకు ట్రీట్మెంట్ కోసం వెళ్లామని చెప్పారు. ఇదే అదునుగా భావించిన బాబా.. తమ కూతురిని భయంకరమైన జబ్బు పట్టిపీడిస్తుంది.. ఒక బంధనం వేయాలని లేదంటే ఆమె మీకు దక్కదని నమ్మించాడని ఆరోపించారు. తనతో పెళ్లి జరిపిస్తే తప్పా యువతి రోగం నయం కాదని ఓప్పించడంతో చివరకు బాబాతో పెళ్లికి ఓప్పుకున్నామని చెప్తున్నారు యువతి పేరెంట్స్.. హైదరాబాద్ లో పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడంతో బాబా ముఖం చాటేశాడని ఆరోపిస్తున్నారు.

ముహుర్థం టైం గడిచినా ఎంత సేపటికి రాలేదని.. రాత్రి 10 గంటల సమయంలో బాబా అనుచరులు ఫంక్షన్ హాల్ కి వచ్చి.. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నమ్మపలికారని చెప్పారు యువతి బంధువులు. పెళ్లి క్యాన్సల్ చేసుకోవాలని చెప్పారని.. దీంతో మోసపోయామని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించామని చెప్తున్నారు యువతి బంధువులు.

ఇవి కూడా చదవండి

యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఫేక్ బాబా హఫీజ్‌ పాషాను అరెస్ట్‌ చేశారు హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పోలీసులు. అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే 7 పెళ్లిళ్లు చేసుకున్న ఫేక్ బాబా ఇప్పుడు ఎనిమిదో పెళ్లికి రెడీ అయ్యాడని చెప్తున్నారు బాధితులు. హఫీజ్ పాషా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి.. తమ కూతురు ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఏదో మాయా మంత్రం చేశాడని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను మోసం చేసిన బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు యువతి పేరేంట్స్. షో ఇప్పటికైనా ప్రజల ఫేక్ బాబాల మాటలు విని మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

 బాబా బాధితురాలు ఫాతిమా 

ఇదే విషయంపై బాధితురాలు ఫాతిమా మాట్లాడుతూ.. తన వయసు 18 ఏళ్ళు అని..  ఆయన వయసు 50 సంవత్సరాలని తెలిపింది. తాను చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. దీంతో తన తల్లిదండ్రులు నెల్లూరు రహమతాబాద్‌ దర్గా బాబా దగ్గరకు తీసుకెళ్లారని తెలిపింది. చాలాకాలం నుంచి బాబా హఫీజ్‌ పాషా ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నట్లు. 3 సంవత్సరాల నుంచి తనను నిఖా చేసుకోవాలని బాబా ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొంది. అయితే తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఈ నిఖా చేస్తే తప్ప నా ఆరోగ్యం బాగుపడదని తల్లితండ్రులను బాబా నమ్మించడంతో అంగీకరించానని తెలిపింది. పెళ్ళికి ఏర్పాట్లు చేసుకున్న తర్వాత పెళ్లి సమయానికి బాబా రాకపోవడంతో అసలు విషయం బయటపడింది. తాను మోసపోయానని తెలసుకుని పోలీసులను ఆశ్రయించానని తనలా మరో యువతి ఈ బాబా దగ్గర మోసపోకూడదనే ఉద్దేశ్యంతోనే పోలీసులకు ఫిర్యాదు చేమని తెలిపింది/

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..